E-Paper
Advertisement

OTT Movie : అర్థరాత్రి దెయ్యాల వేట… ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తూ… గుండె గట్టిగా ఉన్నోళ్లకే ఈ సినిమా

OTT Movie : అర్థరాత్రి దెయ్యాల వేట… ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తూ… గుండె గట్టిగా ఉన్నోళ్లకే ఈ సినిమా
Advertisement

OTT Movie : దెయ్యాల సినిమాలు ఎక్కువగా హాంటెడ్ హౌస్ లలోనే జరుగుతుంటాయి. ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ తో దెయ్యాలకు లింకు పెట్టి ప్రజెంట్ లో హారర్ సీన్స్ తో స్టోరీని ఉత్కంఠంగా నడిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక భయంకరమైన హాంటెడ్ హౌస్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఒక కన్నడ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా ఒక ఆత్మ చుట్టూ తిరుగుతుంటుంది. అది ఎందుకు మనుషుల్ని చంపుతుంది ? దాని గతం ఏమిటి ? అనే సంఘటనలతో స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో అంటే

‘నా నిన్న బిడలారే’ (Naa ninna bidalaare) 2024లో విడుదలైన కన్నడ హారర్ సస్పెన్స్ మూవీ. మొదటి సారి డైరెక్టర్‌గా నవీన్ జీ.ఎస్. రూపొందించిన ఈ చిత్రంలో అంబాలి భారతి, పంచి, కె.ఎస్. శ్రీధర్, శ్రీనివాస ప్రభు, హరిణి శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 నవంబర్ 29న థియేటర్లలో విడుదల అయింది.142 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులోకి రాలేదు. తొందరలోనే zee 5, ప్రైమ్ వీడియొలోకి వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక హాంటెడ్ హౌస్ లో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు రావడంతో అక్కడికి కొంతమంది యూట్యూబర్స్ ఘోస్ట్ హంటింగ్ అనే కాన్సెప్ట్ కోసం వెళ్తారు. అయితే అక్కడ ఒక భయంకరమైన ఆత్మ వీళ్ళని హంట్ చేస్తుంది. ఘోరంగా అందరినీ చంపేస్తుంది. స్టోరీ ఫ్లాష్ బాక్ కి వెళ్తుంది. చార్వి అనే అమ్మాయి ఒక రోజు ఉదయం నది ఒడ్డున మూర్ఛ పోయి పడుకుని ఉంటుంది. కళ్లు తెరిచి చూస్తే ఏమీ గుర్తు ఉండదు. తన పేరు, ఇల్లు, ఫ్యామిలీ, ఏదీ గుర్తులేదు. అక్కడికి వచ్చిన రిషి అనే అబ్బాయి ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి, తర్వాత తన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. రిషి అమ్మ, నాన్న, చెల్లి ఉన్న హ్యాపీ ఫ్యామిలీ. చార్విని చాలా బాగా చూసుకుంటారు. మెల్ల మెల్లగా చార్వికి చిన్న చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లు గుర్తుకు వస్తాయి. కానీ అవి సాధారణంగా అనిపించవు. ఒక భయంకరమైన దెయ్యం ఆమెని వెంటాడుతున్నట్టు, ఎవరో గొంతు పిసికి చంపేస్తున్నట్టు ఉంటుంది.

Read Also : ఫ్యామిలీ ఫ్యామిలీ నేరస్థులే… ప్యూర్ గా యాక్షన్ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ

Advertisement

చార్వి భయపడి రిషితో చెప్పగానే ఇద్దరూ కలిసి చార్వి గతం తెలుసుకోవడానికి ఒక ఆలయం గురువు దగ్గరకు వెళతారు. గురువు ఆ అమ్మాయి శరీరంలో చాలా పవర్‌ఫుల్ స్పిరిట్ ఉందని, దాన్ని బయటకు తీయకపోతే మొత్తం ఫ్యామిలీని చంపేస్తుందని చెప్తాడు. చార్వి గతం ఒక పెద్ద పాత ఎస్టేట్‌కి సంబంధించినదని తెలుస్తుంది. ఒక ఆడ దెయ్యం ఆ ఇంట్లో ఉండి, ఎవరు వచ్చినా చంపేస్తుంది. ఆ దెయ్యం చార్వి శరీరంలోకి ఎలా వచ్చింది? ఆ దెయ్యానికి చార్వితో ఏం పని? అనే ప్రశ్నలతో కథ ఉత్కంఠంగా నడుస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి ఆ ఇంటి గతం ఏమిటి ? చార్విలో ఉన్న దెయ్యాన్ని రిషి వెల్లగొడతాడా ? అనే విషయాలను, హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×