E-Paper
Advertisement

Naveen Chandra: 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి రానున్న నవీన్ చంద్ర డార్క్ హారర్ థ్రిల్లర్ మూవీ!

Naveen Chandra: 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి రానున్న నవీన్ చంద్ర డార్క్ హారర్ థ్రిల్లర్ మూవీ!
Advertisement

Naveen Chandra: ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటికాలంలో ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సెలబ్రిటీల స్టేటస్ ను బట్టి థియేటర్ కి వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు అవతల ఎంత పెద్ద తోపైనా కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సెలబ్రిటీలు కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే కచ్చితంగా వారిని అందలం ఎక్కిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే థియేటర్లలోనే కాదు ఆ థియేటర్లలో విడుదలైన చిత్రాలు ఇటు ఓటిటిలోకి కూడా వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అందులో భాగంగానే ఫ్యామిలీ, కామెడీ, హారర్, థ్రిల్లర్, మాస్, యాక్షన్ ఇలా ప్రతి జానర్ కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందివ్వడానికి సిద్ధం అయిపోయింది.

ఓటిటిలోకి రాబోతున్న నవీన్ చంద్ర హనీ మూవీ..

ఇదిలా ఉండగా థియేటర్లలో హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన నవీన్ చంద్ర (Naveen Chandra) సినిమా 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి రావడంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు.. అసలు విషయంలోకెళితే.. పలాస , శ్రీదేవి సోడా సెంటర్ , మట్కా వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. ఫిబ్రవరి 6న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెలలోపే ఓటిటిలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని ఓవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రవిపీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇందులో దివ్యాపిళ్ళై, రాజా రవీంద్ర , దివి కీలక పాత్రలు పోషించారు.

స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ లో ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్ వర్షన్ లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ విడుదల కానుంది. క్షుద్ర పూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్ తో డార్క్ సైకాలజికల్ థ్రిల్లర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.

హనీ సినిమా స్టోరీ విషయానికి వస్తే..

హీరో నవీన్ చంద్రకి మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగానే తన ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఆయన భార్య దివ్య, కూతురు జయన్ని భయభ్రాంతులకు గురవుతున్నా.. నవీన్ చంద్ర మాత్రం క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఒక బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే తన కోరిక నెరవేరుతుందని.. అందుకుగాను కూతురు తన మాట వినాలని చెబుతాడు. మొదట భార్య భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా కొన్ని కారణాలవల్ల ఆమె ఒప్పుకుంటుంది. కూతురుతో నవీన్ చంద్ర ఏం పని చేశాడు? క్షుద్ర పూజలు నిజంగానే ఫలించాయా? నవీన్ చంద్ర కారణంగా తల్లి కూతుర్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి ?తదితర విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

also read: Allu Arjun: తమ్ముడి పెళ్లి.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన బన్నీ.. గెస్ట్లుగా ఎవరంటే?

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×