E-Paper
Advertisement

Smartphone Comparison: లావా బోల్డ్ N2 vs గెలాక్సీ F07 vs మోటో G06 పవర్.. రూ.8000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: లావా బోల్డ్ N2 vs గెలాక్సీ F07 vs మోటో G06 పవర్.. రూ.8000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Lava Bold N2 vs Galaxy F07 vs Moto G06 Power Smartphone Comparison| ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా ఇటీవల లావా బోల్డ్ N2 మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌‌లో లాంచ్ అయింది. బోల్డ్ N2కి పోటీగా ఇదే ధరలో శాంసంగ్ గెలాక్సీ F07 5G, మోటో G06 పవర్‌ పోటీగా ఉన్నాయి. ఈ మూడు ఫోన్లు.. ధర, డిస్‌ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీలో మంచి ఫీచర్లు ఇస్తున్నాయి. మీరు ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు వాటి ఫీచర్లు పోల్చి తెలుసుకుందాం.

డిస్‌ప్లే పోలిక

లావా బోల్డ్ N2లో 6.75 ఇంచ్ HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ F07 5Gలో 6.7 ఇంచ్ PLS LCD HD+ స్క్రీన్ ఉంది. ఇది 720×1600 రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. మోటో G06 పవర్‌లో 6.88 ఇంచ్ HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 720×1640 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డిస్‌ప్లేలో మోటో ముందుంది.

పర్‌ఫామెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్

లావా బోల్డ్ N2లో యూనిసాక్ SC9863A ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉంది. ఇది సాధారణ పనులకు సరిపోతుంది. శాంసంగ్ గెలాక్సీ F07 5Gలో మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో బాగా పనిచేస్తుంది. మోటో G06 పవర్‌లో మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్ ఉంది. మూడు ఫోన్లలోనూ 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. లావా ఆండ్రాయిడ్ 15 Go ఎడిషన్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ ఆండ్రాయిడ్ 15తో One UI 7.0 ఇస్తుంది. మోటో ఆండ్రాయిడ్ 15తో Hello UIతో వస్తుంది. పనితీరులో శాంసంగ్ బెస్ట్.

కెమెరా సెటప్

లావా బోల్డ్ N2లో 13MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీకి 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ F07 5Gలో 50MP మెయిన్ కెమెరా,  2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8MP. మోటో G06 పవర్‌లో 50MP ప్రైమరీ కెమెరా మరియు 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరాలో శాంసంగ్ మరియు మోటో ముందుంటాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

లావా బోల్డ్ N2లో 5,000mAh బ్యాటరీ ఉంది. శాంసంగ్ గెలాక్సీ F07 5Gలో కూడా 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటో G06 పవర్‌లో 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తంది. బ్యాటరీ బ్యాకప్‌లో మోటో టాప్‌లో ఉంది.

Also Read: మీ పాత ఫోన్ ఈజీగా విక్రయించి క్యాష్ పొందండి.. ఎలా చేయాలంటే?

భారతదేశంలో ధరలు

లావా బోల్డ్ N2 (4GB + 64GB) ధర రూ.7,499. శాంసంగ్ గెలాక్సీ F07 5G (4GB + 64GB) కూడా రూ.7,499కే దొరుకుతుంది. మోటో G06 పవర్ (4GB + 64GB) ధర రూ.7,999. మూడు ఫోన్లలోనూ స్టోరేజ్ మైక్రోఎస్‌డీ కార్డ్‌తో పెంచుకోవచ్చు.

సాధారణ ఉపయోగానికి, అతి తక్కువ ధరలో కావాలంటే లావా బోల్డ్ N2 ఎంచుకోండి.
మంచి పర్‌ఫామెన్స్, కెమెరా కావాలంటే శాంసంగ్ గెలాక్సీ F07 5G బెస్ట్.
ఎక్కువ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే కావాలంటే మోటో G06 పవర్ గెలుస్తుంది. మీ రోజువారీ అవసరాల ఆధారంగా ఎంచుకోండి.

 

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×