E-Paper
Advertisement

Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టా రాజ్యం.. సమయమైనా కనిపించని అధికారులు

Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టా రాజ్యం.. సమయమైనా కనిపించని అధికారులు
Advertisement

Yellampet Municipality స్వేఛ్చ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో కమిషనర్ స్వామి నాయక్(Commissioner Swami Nayak) సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం 11.20 గంటలు అయినా ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి ఆలస్యంగా రావడం, కొన్ని సందర్భాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు.

Also Read: Real Story: మరణాన్ని కళ్లారా చూసి బయటపడిన ఓ వ్యక్తి కథ

ప్రజలు ఆవేదన వ్యక్తం..

Advertisement

అత్యవసర సమస్యలపై ఫోన్ ద్వారా సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా స్పందన లభించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, తిరిగి కాల్ చేయకపోవడం వల్ల సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో ఎల్లంపేట్ మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సలాం(Manager Abdul Salam) కూడా సమయానికి కార్యాలయానికి రాకపోవడం పై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఫోన్ కాల్స్‌కూ స్పందిస్తూ..

ప్రజలకు సమయానికి అందుబాటులో ఉండి, ఫోన్ కాల్స్‌కూ స్పందిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ పరిపాలనలో సమయపాలన, స్పందన మెరుగుపరిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read: Old Toothbrush: పాత టూత్ బ్రష్ పడేసే కన్నా ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసా?

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×