E-Paper
Advertisement

Neeli Hakki OTT release date : ఎట్టకేలకు డైరెక్ట్ గా ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Neeli Hakki OTT release date : ఎట్టకేలకు డైరెక్ట్ గా ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?
Advertisement

Neeli Hakki OTT release date : కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైతే, మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతాయి. కానీ మరికొన్ని సినిమాలకు మాత్రం ఓటీటీ మోక్షం దక్కాలంటే చాలా టైమ్ పడుతుంది. అచ్చం అలాగే ఓ అవార్డు విన్నింగ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు నాలుగేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తరువాత స్ట్రీమింగ్ కాబోతున్న ఆ సినిమా ఏంటి? ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ‘నీలి హక్కీ’ (Neeli Hakki) సినిమా గురించి. ఇది 2021లో విడుదలైన కన్నడ మూవీ. ఐటీ ప్రొఫెషనల్ నుండి చిత్రనిర్మాతగా మారిన గణేష్ హెగ్డే దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా అద్భుతమైన ఫిల్మ్ ఫెస్టివల్ రన్ చేసి, గణేష్ హెగ్డేకి ఉత్తమ తొలి దర్శకుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును తెచ్చిపెట్టింది. 2021లో న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, తరువాత ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రీమియర్ అయినప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్లలో చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో గ్రామీణ జీవితం, వలసలు, బాల్యం సంక్షోభాలు వంటి అంశాలను లోతుగా చూపించారు. కానీ ఫెస్టివల్ సర్క్యూట్‌లో బాగా ఆడిన ఇతర సినిమాల మాదిరిగానే, దీనికి థియేటర్ల స్క్రీనింగ్ అయ్యే ఛాన్స్ దక్కలేదు. కానీ నాలుగు సంవత్సరాల తర్వాత, ఈ చిత్రం చివరకు ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయ్యింది. Sun NXTలో ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Read Also : ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌ కు చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్… స్ట్రీమింగ్ కొత్త సిరీస్ సిద్ధం

కథలోకి వెళ్తే… 

10 ఏళ్ల బాలుడు సిద్ధా (అమన్ ఎస్ కర్కేరా). అతని తల్లిదండ్రులు తమ కోసం మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే ఆశతో నగరానికి వలస వెళ్లాలనే కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. దీంతో అప్పటిదాకా తాను పుట్టి పెరిగిన ఊరిని ఆ పిల్లాడు వదిలి వెళ్ళవలసి వస్తుంది. అయితే సిద్ధా పల్లెటూరి జీవితంలోని ప్రశాంతతను సిటీకి వెళ్ళాక మిస్ అవుతాడు. నగరంలోని హడావిడి అతనికి ఊపిరి ఆడనివ్వదు. మరి ఆ అబ్బాయి ఈ కొత్త మార్పుతో సర్దుకుపోతాడా? లేదా తన గ్రామానికి తిరిగి వెళ్తాడా ? నీలి హక్కీ అంటే ఏంటి? అనేది కథ.

Advertisement

ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్‌పాండే (సిద్ధా తండ్రి), నిధి హెగ్డే (తల్లి), అమన్ ఎస్ కర్కేరా (సిద్ధా), నరేష్ భట్, చంద్రహాస్ ఉల్లాల్, నంజప్ప తదితరులు నటించారు. అమన్ ఎస్ కర్కేరా బాల నటుడిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని అమాయకత్వం సినిమాలో హైలైట్. సంగీతం గగన్ బడేరియా అందించారు. గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే మెలోడిక్ ట్రాక్స్ బాగున్నాయి. తమిళ స్టార్ విజయ్ సేతుపతి సమర్పకుడిగా వ్యవహరించారు. సినిమాటోగ్రాఫీ గ్రామీణ అందాలు, నగర హడావిడి మధ్య కాంట్రాస్ట్‌ను బాగా చూపించింది.

గణేష్ హెగ్డే ఎవరు ?

‘నీలి హక్కీ’ తర్వాత, దర్శకుడు గణేష్ పెడ్రో నిర్మాత నటేష్ హెగ్డేతో కలిసి ‘కుర్కా’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించాడు. విజయ్ రాఘవేం,ద్ర అవినాష్ నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. గణేష్ హెగ్డే ఐటీ ప్రొఫెషనల్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు, నీలి హక్కీతో రాష్ట్ర అవార్డు గెలుచుకున్నాడు. ఈ సినిమా అతని కెరీర్‌లో ముఖ్యమైన మైలురాయి.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×