E-Paper
Advertisement

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. 83 స్థానాల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. 83 స్థానాల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా

Telangana Municipal Elections:  రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపోల్ లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, మరో ఏడు కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఓట్ల లెక్కింపును చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 136 కౌంటింగ్ సెంటర్లలో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. గత నెల 28వ తేదీన ఎన్నికల కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేయటంతో మొదలైన ఎన్నికల నిర్వహణలో చివరి, కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా  ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలను అమలు చేయటంతో పాటు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ ను అమలు చేసినా, పలు కౌంటింగ్ సెంటర్ల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పరస్పర దాడులు వంటి స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్ లో భాగంగా మధ్యాహ్నం  కల్లా పలు మున్సిపాల్టీల వార్డుల ఫలితాలను వెల్లడించారు. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపాల్టీల్లోని అత్యధిక వార్డులను కైవసం చేసుకోగా, ఈ సారి బీఆర్ఎస్ ప్రాబల్యం కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. ఇక బీజేపీ పార్టీకి కూడా ఈ సారి కాస్త ఆదరణ పెరిగింది..తాము గెలుస్తామని భావించిన చోట ఓటమి పాలై, ఓటమి పాలవుతామని భావించిన చోట బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు. సాయంత్రం ఆరు గంటల వరకు ప్రకటించిన ఫలితాల్లో భాగంగా మొదటి నుంచి బీజేపీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొనసాగుతూ చివరకు ఆ సీట్లు కైవసం చేసుకుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మజ్లీస్, కాంగ్రెస్ మిత్రపక్షం కారణంగా గెలుస్తామని భావించిన ఆ సీటును బిజెపి పార్టీ కోల్పోవాల్సి వచ్చింది.

2569 వార్డుల్లో కౌంటింగ్

116 మున్సిపాల్టీల్లోని 2581 వార్డుల్లో 1345 కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 720, బీజేపీ 260, స్వాతంత్ర్య అభ్యర్థులు, ఇతరులు 253 వార్డులను కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 414 వార్డుల్లో రెండు ఎన్నిక ఏకగ్రీవం కాగా, మిగిలిన 412 వార్డుల్లో కౌంటింగ్ నిర్వహించారు. 116 మున్సిపాల్టీల్లో మొత్తం 2582 వార్డులుండగా, వీటిలో ఒక వార్డు ఎన్నిక వాయిదా పడగా, మరో 12 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. ముగిలిన 2569 వార్డుల్లో కౌంటింగ్ నిర్వహించారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగు కార్పొరేషన్లను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, రెండింటిని బీజేపీ గెలుచుకోగా, ఒక కార్పొరేషన్ ను సీపీఐ పార్టీ గెలుచుకున్నట్లు ఫలితాలు వెల్లడయ్యాయి. కొన్ని మున్సిపాల్టీల్లో గెలిచిన స్వాతంత్ర్య అభ్యర్థులే కీలకంగా మారారు. కాగా, వికారాబాద్ మున్సిపాల్టీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య వార్డు నెంబర్ 17 నుంచి విజయం సాధించారు.

Also Read: GHMC: మూడు కార్పొరేషన్లలో అధికారుల కొరత.. డబుల్ బాధ్యతలతో బేజారవుతున్న ఆఫీసర్లు

మరో 76 డివిజన్లలో తమ సత్తా

మధ్యాహ్నాం కల్లా వచ్చిన ఫలితాల ప్రకారం బిచ్కుంద ఎల్లారెడ్డి, హుజూర్ నగర్, నేరేడుచర్ల, హోలియా, నందికొండ, గుమ్మడిదల, నారాయణఖేడ్, బాన్సువాడ, కొడంగల్ మధిర, కొల్లాపూర్, నేరేడుచర్ల, చొప్పదండి, కోదాడ,ఎల్లారెడ్డి, భూత్పూర్ మున్సిపాల్టీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాత్రి ఎనిమిది గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం కార్పొరేషన్లలోని 414 డివిజన్లలో కాంగ్రెస్ 176, బీజేపీ 53, బీఆర్ఎస్ 73 డివిజన్లను కైవసం చేసుకోగా, ఇతరులు మరో 76 డివిజన్లలో తమ సత్తా చాటుకున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీనంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే దిశగా గట్టిగా పోటీనిచ్చిన బిజెపి కౌంటింగ్ ప్రక్రియలో చోటు చేసుకున్న చివరి ఫలితాలు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మిత్రపక్షం కారణంగా ఆ సీటును పోగొట్టుకోవలసి వచ్చింది., కొత్త గూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను సీపీఐ పార్టీల, మిగిలిన రామగుండ, మహాబూబ్ నగర్, నల్గొండ, మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్లను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

ఇద్దరూ గెలిచారు

గద్వాల మున్సిపాల్టీలోని వార్డు నెంబర్లు 19, 26ల నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన భార్య భర్తలిద్దరు గెలుపు సాధించారు. జిల్లా బీజీపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామాంజనేయులు ఆయన సతీమణి కృష్ణవేణి గద్వాల మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ గా గతంలో పనిచేశారు. కృష్ణవేణి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ నుంచి భార్యభర్తలిద్దరు వార్డు నెంబర్లు 19,26 పోటీ చేయగా 19 వ వార్డు నుంచి రామాంజనేయులు విజయం సాధించగా, 26 వ వార్డు నుంచి కృష్ణవేణి సైతం గెలిచారు.

హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు

వేములవాడ, గద్వాల్, బోధన్, అలియాబాద్, మెహబూబాబాద్, కోహిర్, నర్సాపూర్, మెదక్, బెల్లంపల్లి, నారాయణపేట్, మెట్ పల్లి, రాయికల్, వర్ధన్నపేట. మరిపెడ, ఖానాపూర్, ఇంద్రేశం, అలంపూర్, ఇస్నాపూర్ జిన్నారం, జమ్మికుంట, కొత్తగూడెం కేసముద్రం, జనగాం, అమరచింత, ఆసిఫాబాద్, జిన్నారం, జహిరాబాద్ మున్సిపాల్టీలతో పాటు మొత్తం 32 మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడినట్లు సమాచారం. దీంతో పాటు మెదక్, జనగామమున్సిపాల్టీల్లోనూ హంగ్ ఏర్పడటంతో క్యాంప్ రాజకీయాలు మొదలైనట్లు సమాచారం.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

యాదగిరి గుట్ట మున్సిపాల్టీలో వార్డు నెంబర్ 9 నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజమణి తాను ఓటమి పాలైన తర్వాత ఆవేదన చెందుతున్న వీడియో సోషల్ మీడియాలో వరల్ అయింది. దేశం, ధర్మ కోసం కష్టపడుతున్న తనకు యువత ఓట్లు వేసి గెలిపించాలని ఆమె చేసిన వీడియోతో పాటు ఓటమి పాలైన తర్వాత సోషల్ మీడియాలో రాజమణి ఏడుస్తూ వచ్చిన వీడియో శుక్రవారం కౌంటింగ్ రోజైన శుక్రవారం వైరల్ అయింది.

ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు

రాష్ట్రంలోని మంచిర్యాల్, నల్గొండ,కొత్తగూడెం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫలితాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఏడు కార్పొరేషన్లలో ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకోగా మిగిలిన రెండు కార్పొరేషన్లను బిజెపి ఒకటి, సిపిఐ ఒకటి స్వాధీనం చేసుకుంది. మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా వాటిలో కాంగ్రెస్ 44 బిజెపి 5, బీఆర్ఎస్ 8 స్వాధీనం చేసుకున్నాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 48 డివిజన్లో ఉండగా, కాంగ్రెస్ 28, బిజెపి 9, ఇతరులు రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్ లు ఉండగా, కాంగ్రెస్ 22, బిజెపి ఒకటి, బీఆర్ఎస్ 8, సిపిఐ 22 డివిజన్ స్వాధీనం చేసుకొని కార్పొరేషన్ సీట్లు దక్కించుకుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా వీటిలో కాంగ్రెస్ 13,బిజెపి 30, బీఆర్ఎస్ 8, ఎంఐఎం 4, ఇతరులు 10 డివిజన్ లను గెలుచుకున్నారు. నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్ లు ఉండగా, వాటిలో కాంగ్రెస్ 17, బిజెపి 28,బీఆర్ఎస్ ఒక్క, ఎంఐఎం 14 డివిజన్లో స్వాధీనం చేసుకుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 13, బిజెపి ఒకటి, ఇతరులు 8 డివిజన్లను గెలుచుకున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లో ఉండగా, వీటిలో కాంగ్రెస్ 13,బీఆర్ఎస్ 8, బిజెపి 5, ఎంఐఎం రెండు ఇతరులు రెండు డివిజన్లను గెలుచుకున్నారు.

మున్సిపాలిటీల ఫలితాలు ఇలా ఉన్నాయి

రాష్ట్రంలోని మొత్తం ఒక్క 116 మున్సిపాలిటీలకు జరగగా, శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ 83 మున్సిపాలిటీలను ,బీఆర్ఎస్ 15, బిజెపి 2 ఎంఐఎం రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి.

కౌంటింగ్ ఇలా

116 మున్సిపాల్టీలు, మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 8203 పోలింగ్ స్టేషన్లుండగా, వీటిలో ఎన్నిక ఏకగ్రీవమైన వార్డులు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించినానంతరం మొత్తం 137 స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచిన 16 వేల 31 బ్యాలెట్ బాక్స్ లను 136 డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్లు, కౌంటింగ్ సెంటర్లకు తరలించి, లెక్కించారు. ఒక్కో వార్డులోని పోలింగ్ స్టేషన్ల వరస సంఖ్య ఆధారంగా బ్యాలెట్లను అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఈ ఆ తర్వాత 25 బ్యాలెట్ పేపర్లు చొప్పున బండిల్స్ గా మార్చుకుని లెక్కింపు టేబుళ్ల పైకి పంపి, 25 బ్యాలెట్లతో ఉన్న సుమారు 40 బండిల్స్ ( వెయ్యి బ్యాలెట్ల)ను ఒక రౌండ్ గా లెక్కించి, ఫలితాలను వెల్లడించారు. ఫలితాలను మైక్ ద్వారా ప్రకటించారు. కౌంటింగ్ సెంటర్లలోకి మీడియా ప్రతినిధులను, జర్నలిస్టులను అనుమతించకపోవటంతో పలు చోట్ల మీడియా ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేశారు. అనుమానాస్పదంగా కన్పించిన, చెల్లని ఓట్లు, నోటా ఓట్లను ప్రత్యేకమైన ఓ చెక్క ట్రేలలో వేసి ప్రతి బ్యాలెట న కౌంటింగ్ ఏజెంటుకు చూపిస్తూ, అది సరిగ్గా ఉంటేనే లెక్కింపులో పరిగణలోకి తీసుకుని లెక్కించారు. ప్రతి ఓటును రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలించి దాన్ని చెల్లబాటును నిర్ణయించిన తర్వాతే దాన్ని కౌంట్ లోకి తీసుకున్నారు.

Also Read: Telangana Municipal Elections 2026: అభివృద్ధికి ప్రజల మద్దతు.. ప్రజా ప్రభుత్వంపై నమ్మకానికి ఈ గెలుపే నిదర్శనం: భట్టి

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×