E-Paper
Advertisement

OTT Movie: గ్రామాన్ని కాపాడే కోడి… అన్నం తిను అంటూ వెంట పడే దెయ్యం… క్రేజీ మలయాళ సినిమా

OTT Movie: గ్రామాన్ని కాపాడే కోడి… అన్నం తిను అంటూ వెంట పడే దెయ్యం… క్రేజీ మలయాళ సినిమా
Advertisement

OTT Movie : మలయాళం సినిమాలు ఇప్పడు అందరికీ హాట్ కేకులతో సమానం. వచ్చిన ప్రతి సినిమాపై ఓ లుక్ వేస్తున్నారు ఆడియన్స్. వీటిలో హారర్ సినిమాలను అస్సలు వదలట్లేదు. రీసెంట్ గా ఒక హారర్ మూవీ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక చిన్న ఊరిలో రాత్రి పూట జరిగే భయంకరమైన మిస్టీరియస్ ఆకారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కొంచెం కామెడీ మిక్స్ తో కథ ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ తో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

2025లో వచ్చిన ఈ మలయాళం హారర్ కామెడీ మూవీ పేరు నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్ (Nellikkampoyil Night Riders). ఇందులో మాథ్యూ థామస్ లీడ్ రోల్‌లో నటించగా, నౌఫల్ అబ్దుల్లా దర్శకత్వం వహించారు. రోషన్ శానవాస్, మీనాక్షి ఉన్నికృష్ణన్, సరత్ సభా, మెరిన్ ఫిలిప్ ముఖ్య పాత్రల్లో నటించారు. 2025 అక్టోబర్ 24న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా, 142 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.1/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా తొందరలోనే ప్రైమ్ వీడియోలో రబోతోందని సమాచారం.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ష్యామ్ అనే యంగ్ అబ్బాయి నెల్లికంపోయిల్ అనే చిన్న గ్రామంలో ఉంటాడు. రోజంతా ఫ్రెండ్స్‌తో బైక్‌ లో షికార్లు కొడుతూ, గర్ల్‌ఫ్రెండ్ మీనాక్షితో ఫ్లర్ట్ చేసుకుని హ్యాపీగా బతికేస్తుంటాడు. కానీ రాత్రి 12 దాటగానే ఆ ఊరంతా దిగులుగా మారిపోతుంది. ఎందుకంటే ఎవరో రాత్రి పూట ఇళ్లలోకి వచ్చి, కోడి తలలు కోసి వేలాడదీసి, రక్తం చిమ్ముతూ పోతారు. అది మనిషి ఆకారంలో ఉండే ఒక జంతువుగా కొంత మంది గుర్తిస్తారు. కానీ భయపడి పట్టుకోలేక పోతారు. ఆప్పుడప్పుడూ హత్యలు కూడా జరుగుతుంటాయి. దీంతో ఊరంతా భయపడి తలుపులు వేసుకుని కూర్చుంటారు. ష్యామ్ మొదట్లో వీటిని తేలిగ్గా తీసుకుంటాడు. ఇక్కడే ఒక ఆత్మ అన్నం తిను అంటూ ష్యామ్ వెంట పడుతుంటుంది.

Read Also : ఫ్యామిలీ ఫ్యామిలీ నేరస్థులే… ప్యూర్ గా యాక్షన్ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ

Advertisement

అయితే అదే రోజు ఒక వింత ఆకారం అతని ఫ్రెండ్‌ మీద కూడా దాడి చేస్తుంది. ష్యామ్ దీని వెనుక ఉన్న సీక్రెట్ బయట పెట్టడానికి గట్టిగా డిసైడ్ అవుతాడు. అయితే అతనికి రాత్రి పూట భయపడే ఫోబియా ఉంటుంది. అయినా కూడా ధైర్యం తెచ్చుకుని దీనికి కారణం ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఉన్నట్టుండి ఆ వింత ఆకారం ఒక పాత బంగ్లా దగ్గరకు వీళ్ళను తీసుకెళ్తుంది. అక్కడ అసలు రహస్యం రివీల్ అవుతుంది. క్లైమాక్స్ కూడా అందరూ ఆశ్చర్య పోయేలా ఉంటుంది. చివరికి అన్నం తినమని వెంట పడే దెయ్యం ఎవరు ? కోడి తలకాయలను ఎందుకు గుమ్మాలకు వేలాడదీస్తున్నారు ? ఆ వింత ఆకారం మిస్టరీ ఏంటి ? ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళం హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×