It Welcome to Derry Review : హర్రర్ థ్రిల్లర్ సిరీస్ లలోనే భారీ అంచనాలతో వచ్చిన సిరీస్ ‘ఇట్ వెల్కమ్ టు డెర్రీ’. 1986లో స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ‘ఇట్’ కి ప్రీక్వెల్ గా రూపుదిద్దుకుంది. ‘ది డ్యాన్సింగ్ క్లౌన్’ అనే పెన్నీవైస్ భూతం మూలాలను తెలుసుకునే కథే ఈ సిరీస్.1962లో డెర్రీ పట్టణంలో పెన్నీవైస్ ఎలా విధ్వంసం సృష్టిస్తుందో ఈ సిరీస్ లో చూసి తెలుకోవాలి. టేలర్ పైజ్, జోవన్ అడెపో, బ్లేక్ కామెరాన్ జేమ్స్, క్రిస్ చాక్, జేమ్స్ రెమార్, స్టీఫెన్ రైడర్, మడేలిన్ స్టోవ్, రూడీ మాన్కుసో, క్లారా స్టాక్, అమండా క్రిస్టీన్, మిక్కల్ కరీం-ఫిడ్లర్, బిల్ స్కార్స్‌గార్డ్ ఇందులో నటించగా, ఆండీ మషెటి, బార్బరా మషెటి, జేసన్ డెవలప్ చేశారు. అక్టోబర్ 27 నుంచి ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ 9 ఎపిసోడ్‌లు ఉండగా, అక్టోబర్ 27 నుండి డిసెంబర్ 14 వరకు వారానికో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటిదాకా 5 ఎపిసోడ్ లు రిలీజ్ కాగా, అవి ఎలా ఉన్నాయో రివ్యూలో తెల్సుకుందాం.
ఎపిసోడ్ 1 : 1962 డెర్రీ అనే పట్టణంలో టెడ్డీ అనే పిల్లాడితోపాటు, ముగ్గురు ఫ్రెండ్స్ ఒక చోట ఉన్నప్పుడు, వాళ్ళల్లో ఒక క్లాస్‌మేట్ ఒక్కసారిగా మిస్ అయిపోతాడు. వెతుకుతూ సీవర్స్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక రెడ్ బెలూన్ కనిపిస్తుంది. ఒక్కసారిగా పెన్నీవైజ్ షాడో కనిపించి వీళ్ళను భయపెడుతుంది. ఇంకో సైడ్ ఒక పెద్ద మిషన్‌లో భాగంగా, మిలిటరీ మేజర్ లెరాయ్ డెర్రీకి వస్తాడు.
ఎపిసోడ్ 2 : టెడ్డీ గ్రూప్ మళ్లీ మిస్సింగ్ పిల్లవాడిని వెతుకుతూ సీవర్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ రక్తం కారుతూ ఉంటుంది. లెరాయ్ తన టీమ్‌తో మీటింగ్ పెట్టి ఇక్కడ ఒక దుష్ట శక్తి ఉందని, అదే పెన్నీవైజ్ అని చెప్తాడు. 1910 ఫ్లాష్‌బ్యాక్ లోని సీక్రెట్ బయట పడుతుంది. చివర్లో టెడ్డీ ఒక్కడే సీవర్స్‌లోకి వెళ్లి పెన్నీవైజ్‌ని మొదటి సారి ఫుల్‌గా చూస్తాడు.
ఎపిసోడ్ 3 : లెరాయ్‌కి సైకిక్ సోల్జర్ డిక్ హాలరాన్ దొరుకుతాడు. ఇద్దరూ కలిసి పెన్నీవైజ్ గురించి రిసెర్చ్ చేస్తారు. టెడ్డీ గ్రూప్ ఒక పాత హౌస్‌లోకి వెళ్లి పెన్నీవైజ్‌తో ఫస్ట్ ఫైట్ మొదలు పెడతారు. అక్కడ పెన్నీవైజ్ ను చంపగలిగే ఒక మ్యాజికల్ నైఫ్ దొరుకుతుంది.
ఎపిసోడ్ 4 : టెడ్డీ గ్రూప్ ఫేమస్ హాంటెడ్ హౌస్ 29 నెయిబోల్ట్ స్ట్రీట్‌కి వెళ్తారు. అక్కడ పెన్నీవైజ్ ఫుల్ పవర్‌లో ఉంటుంది. పిల్లల్ని దారుణంగా హంట్ చేస్తుంది.
ఎపిసోడ్ 5 : పిల్లలు, మిలిటరీ టీమ్ రెండూ కలిసి “ఆగరీ” అనే పాత రిట్యువల్ గురించి తెలుసుకుంటారు. దీంతో పెన్నీవైజ్‌ని 27 ఏళ్లు నిద్ర పుచొచ్చు. కానీ దానికి 13 మ్యాజికల్ వస్తువులు కావాలి. ఇంతలో పెన్నీవైజ్ ఫుల్ ఫామ్‌లో వచ్చి మిలిటరీ సోల్జర్స్‌ని ఒక్కొక్కరిగా చంపేస్తుంది.
ఇట్: వెల్ కమ్ టు డెర్రీ అనేది సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో మరో సీజన్. ఈ సిరీస్ లో 2017లో ఇట్, 2019లో ఇట్ ఛాప్టర్ టు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు కూడా ఆడియన్స్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ‘ఇట్’కు ప్రీక్వెల్ గా ‘ఇట్: వెల్ కమ్ టు డెర్రీ’. ‘వెల్కమ్ టు డెర్రీ’లో భయం అనేది ప్రధానాంశం. మొదటి నుంచే పెన్నీవైజ్ భూతం భయపెట్టి బలాన్ని పెంచుకోవడం, హింసాత్మకంగా పిల్లల్ని చంపడం వంటివి చేస్తుంది. అయితే నవలలో కంటే సిరీస్ లోనే ఫ్లాష్ బ్యాక్‌లను బాగా వివరించారు. పెన్నీవైజ్, బాబ్ గ్రే, డిక్ హలోరన్ వంటి స్టీఫెన్ కింగ్ ఐకానిక్ పాత్రలు ఇందులో కనిపిస్తాయి. అలాగే వయోలెంట్, హర్రర్ సీన్లకు కొదవేం ఉండదు. చిన్న పిల్లలు చూడకూడని సీన్స్ ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఉన్నప్పుడు చూడకపోవడమే బెటర్. అయితే ఈ సీజన్లో మొదటి కొన్ని ఎపిసోడ్స్ ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే పెన్నివైజ్ ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచే కథ ఊపందుకుంటుంది. ఇక ఆ రక్తపాతం అయితే బ్లడీ బ్లడ్ బాత్. 5 ఎపిసోడ్లు చూశాక ఇప్పుడిప్పుడే కథ ఊపందుకుంటున్నట్టు అన్పిస్తోంది. ఇందులో అసలు ఈ పెన్నివైజ్ ఎవరు? ఎలా పుట్టాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను చూపించారు. మిగతా 4 ఎపిసోడ్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మీరు కూడా ఈ థ్రిల్ ఫీల్ అవుతూనే భయాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి.