BigTV English

OTT Movie : ఆ పాడు వీడియోలకు అడిక్ట్… పక్కింటోళ్ల ప్రైవేట్ వీడియోలు చూసి… స్ట్రిక్ట్లీ సింగిల్స్‌కు మాత్రమే

OTT Movie : ఆ పాడు వీడియోలకు అడిక్ట్… పక్కింటోళ్ల ప్రైవేట్ వీడియోలు చూసి… స్ట్రిక్ట్లీ సింగిల్స్‌కు మాత్రమే

OTT Movie : ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతుందో, సైబర్ నేరాలు కూడా అంతలా పెరిగిపోతున్నాయి. కొంతమంది మేధావులు హాకింగ్ చేసి పెద్ద నేరాలకే పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన తెలుగు టెక్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా చేస్తోంది. ఈ స్టోరీ అసభ్యకరమైన వీడియోలకు అడిక్ట్ అయిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఇతని వల్ల ఒక జంట అనుకోని సమస్యల్లో చిక్కుకుంటుంది. ఈ స్టోరీ ఊహించని ట్విస్టులతో కేక పెట్టుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఒటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


జీ5 లో స్ట్రీమింగ్

‘నెట్’ (NET) 2021లో విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా భార్గవ్ మాచర్ల దర్శకత్వంలో తొలిసారిగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ (లక్ష్మణ్), అవికా గోర్ (ప్రియ), ప్రణీత పట్నాయక్ (సుచిత్ర), విశ్వదేవ్ రచకొండ (రంజిత్) ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్ర నిర్మాణంలో, ఈ సినిమా ZEE5లో 2021 సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ స్టోరీ సైబర్ క్రైమ్, గూఢచర్యం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా మొదట ఆరు ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌గా ప్లాన్ చేయబడింది. కానీ తర్వాత ZEE5 కోసం డైరెక్ట్-టు-వీడియో ఫిల్మ్‌గా మారింది. 1 గంట 43 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 5.6/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) నల్గొండలో ఒక చిన్న మొబైల్ షాప్ నడిపే సాధారణ వ్యక్తి. అతను అసభ్యకరమైన వీడియోలకు అడిక్ట్ అవుతాడు. అతనికి సుచిత్ర (ప్రణీత పట్నాయక్) అనే అమ్మాయితో పెళ్ళి కూడా జరుగుతుంది. అయినా కూడా వివాహ జీవితం అతనికి అసంతృప్తిగా ఉంటుంది. తన జీవితంలో ఏదో కోల్పోయానని భావించే లక్ష్మణ్, ఒక రోజు ఇంటర్నెట్‌లో ఒక అక్రమ స్పైయింగ్ వెబ్‌సైట్‌ను కనుగొంటాడు. ఈ వెబ్‌సైట్ ద్వారా, హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ప్రియ (అవికా గోర్), రంజిత్ (విశ్వదేవ్ రచకొండ) అనే జంట ప్రైవేట్ జీవితాన్ని లైవ్‌ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. ఈ స్ట్రీమింగ్ ఇంట్లో దాచిన స్పై కెమెరాల ద్వారా జరుగుతుంది. ఇది ఫ్రీ, సిల్వర్, గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా వివిధ గదుల ఫుటేజ్‌ను అందిస్తుంది.

లక్ష్మణ్ ఈ వెబ్‌సైట్‌కు బానిస అవుతాడు. ప్రియ జీవితాన్ని గమనిస్తూ, ఆమెపై ఒక అనారోగ్యకరమైన ఆకర్షణ (అబ్సెషన్) పెంచుకుంటాడు. ఈ వెబ్‌సైట్‌లో మరిన్ని గదుల ఫుటేజ్‌ను చూడడానికి అతను డబ్బు ఖర్చు చేయడం మొదలెడతాడు. తన ఆర్థిక స్థితిని కూడా పణంగా పెడతాడు. అతని భార్య సుచిత్రకు లక్ష్మణ్ ప్రవర్తనలో మార్పు, డబ్బు ఖర్చులపై అనుమానం కలుగుతుంది. ఈ సమయంలో ప్రియ, రంజిత్‌ల సంబంధంలో కొన్ని సమస్యలు బయటపడతాయి. లక్ష్మణ్ వారి జీవితంలో ఒక సీక్రెట్ కనిపెడతాడు. ఈ సీక్రెట్ అతన్ని వారి జీవితంలో జోక్యం చేసుకునేలా చేస్తుంది. కానీ అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.

Read Also : బెడ్ పై నరకం చూపించే భర్త… కొట్టి మరీ పని కానిచ్చే సైకో… ఆమె ఇచ్చే ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

సినిమా రెండవ భాగంలో లక్ష్మణ్ చర్యల వల్ల సుచిత్రతో సంబంధం బెడిసికొడుతుంది. అదే సమయంలో ప్రియ, రంజిత్ తమ ప్రైవేట్ జీవితం గూఢచర్యానికి గురవుతోందని తెలుసుకుని, దాని పరిణామాలను ఎదుర్కొంటారు. వీళ్ళు ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటారు ? లక్ష్మణ్ ఎలాంటి సమస్యలు సృష్టిస్తాడు ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : అమ్మ బాబోయ్… పండగ పేరుతో చావుమేళం… ఈ ఊరోళ్ళకి ఇదేం పాడు రోగం భయ్యా

OTT Movie : అమ్మాయిల్ని చంపేసి ఫ్రీజర్ లో దాచే సైకో… ఎక్స్ట్రీమ్ వయోలెన్స్… అవార్డు విన్నింగ్ అలాగే మోస్ట్ కాంట్రవర్షియల్

OTT Movie : వర్షం పడితే మూడ్ వచ్చే సైకో…. రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్

OTT Movie : నెట్ ఫ్లిక్స్‌ను ఓ ఊ‌పు ఊపేసిన సిరీస్… భారీ వ్యూస్ తో పాటు వివాదాలు కూడా

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

Big Stories

×