E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today July 30th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని చంపేస్తానన్న రణవీర్‌

Nindu Noorella Saavasam Serial Today July 30th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని చంపేస్తానన్న రణవీర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మొదటి రౌండ్‌లో మిస్సమ్మ వాళ్లు ఓడిపోతారు. దీంతో మిస్సమ్మ డల్లుగా అయిపోతుంది. అమర్‌ భరోసా ఇస్తుంటాడు. ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి అని అందులో గెలుద్దామని చెప్తాడు. ఇంతలో దగ్గరకు వచ్చిన చిత్ర బావగారు నేను భాగీతో కాస్త మాట్లాడాలి మీరు వినోద్‌ దగ్గరకు వెళ్తారా అంటుంది. సరేనంటూ అమర్‌ వెళ్లగానే.. ఏంటి భాగీ ఒక్కసారికే ఇలా డల్లుగా అయిపోతే ఎలా..? ఇక కాంపిటీషన్‌ అయిపోయే సరికి ఎలా అయిపోతావో ఏమో.. భాగీ తోడికోడలిగా నీకో సజెషన్‌.. ఫ్లీజ్‌ ఓడిపోయినప్పుడు మాత్రం నువ్వు ఏడవకే.. గెలిచాక కప్పు ఎత్తుకుంటే నా పరువు పోతుంది. ఓడిపోతున్నాను అన్న బాధ నీ కళ్లల్లో ముఖంలో చూస్తుంటే.. అప్పుడు గెలిచినంత ఆనందంగా ఉంది నాకు. గెలిచినప్పుడు చూద్దాం అని వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతుంది చిత్ర.

మరోవైపు ఇంట్లోకి వచ్చిన రౌడీలను మనోహరి పిచ్చకొట్టుడు కొట్టి గన్‌తో బెదిరించి బయటకు వెళ్లగొడుతుంది. దీంతో గార్డెన్‌లో ఉన్న ఆరు కూల్ గా కుర్చీలో కూర్చుని రౌడీలు పారిపోవడం చూసి నవ్వుతూ చెప్పాను కదా గుప్త గారు మనునే నా పిల్లలను కాపాడుతుంది అని. నా పిల్లల ప్రాణాలు తీయాలనుకున్న మనోహరే ప్రాణాలకు తెగించి మరీ నా పిల్లలను కాపాడింది. ఈ సీన్‌ చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. వావ్‌ వాట్‌ ఏ సీన్‌ అంటుంది. బయట కారులో కూర్చున్న రణవీర్‌ తన మనుషులు పరుగెత్తుకుంటూ రావడం చూసి కారులోంచి దిగి బయటకు వస్తాడు. అరేయ్‌ ఏమైందిరా పాపం తీసుకురమ్మంటే మీరు పరుగెత్తుకుంటూ వస్తున్నారు అని అడుగుతాడు.

Advertisement

దీంతో రౌడీలు తమను మనోహరి కొట్టి అడ్డుపడిందని చెప్తారు. దీంతో రణవీర్‌ కోపంగా అడ్డొస్తే ఏం చేయాలో చెప్పాను కదా అంటాడు. దీంతో రౌడీలు ఆవిడ అదే అన్నారు సార్‌.. పిల్లల మీద చేయ్యి వేస్తే షూట్‌ చేస్తా అన్నారు. ఏదో చిన్న కిడ్నాప్‌ అంటే వచ్చాము అన్న మరీ ఇలా గన్‌తో కాల్చేస్తాం అంటే మా వల్ల కాదు అన్న అంటూ వెళ్లిపోతారు. దీంతో రణవీర్‌ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోతుంటే. లాయర్‌ రణవీర్‌ ఆగు అంటూ ఆపేస్తాడు.  ఆ మనోహరి అంతు చూసి ఇప్పుడే అంజలిని తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్లబోతుంటే. లాయరు ఆపి రణవీర్‌ ఆగు.. నా మాట విను..  మనోహరి గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళితే నిన్ను కాల్చడానికి క్షణం కూడా ఆలోచించదు. చీకటి పడనివ్వు చీకటే మన ఆయుధం అని ఆపేస్తాడు. రణవీర్‌ కోసంగా ఇవాళ అంజలి తీసుకుపోకుండా నువ్వు నన్ను ఆపలేవు మనోహరి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు కాంపిటీషన్‌లో ఉన్న మిస్సమ్మ కోపంగా అమర్‌ దగ్గరకు వస్తుంది. దీంతో అమర్‌ ఏంటి భాగీ చాలా కోపంగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ కోపంగా వదలను అని మాటలు చెప్పి అక్కడ చిత్ర దగ్గర నన్ను వదిలేసి వస్తావా..? అంటుంది. దీంతో అమర్‌ కూల్‌గా చిత్ర మాటలు గాటుగా ఉన్నా దానికి ధీటైన సమాధానం నువ్వు ఇస్తావు అనుకున్నాను అంటాడు. అమ్మో ఏమో అనుకున్నాను కానీ మీకు బాగా మాటలు వచ్చండి.. ఈ మాటలకే అనుకుంటా..? అక్క పడిపోయినట్టు ఉన్నారు అంటుంది. ఇంతలో నిర్వాహకులు వచ్చి సెకండ్‌ రౌండ్‌ ప్రారంభం కానుంది. ఇందులో రెండు పార్ట్‌ లు ఉంటాయి. అంటూ డీటెయిల్స్‌ చెప్తాడు. అందరూ రెడీగా ఉంటారు.

Advertisement

మరోవైపు రాత్రి కాగానే.. మనోహరి గార్డెన్‌లోకి వెళ్తుంది. వెనక నుంచి గన్‌ తో వచ్చిన రణవీర్‌ మనోహరిని బెదిరిస్తూ మర్యాదగా పిల్లలు ఉన్న గది తాళం ఇవ్వు మనోహరి అంటూ అడగడంతో మనోహరి తాళం ఇస్తుంది. తాళం తీసుకుని రూంలోకి వెళ్లిన రణవీర్‌కు అక్కడ అంజలి కనిపించదు. దీంతో కోపంగా ఏయ్‌ అంజలి ఎక్కడ అని మనోహరిని అడుగుతాడు. నిజంగా నాకు తెలియదు రణవీర్‌ అంటుంది మనోహరి. ఇంతలో బయట బాధగా ఏడుస్తున్న ఆరుకు చాన్స్‌ వస్తుంది. పెద్దగా గాలి వచ్చి మనోహరి ఇంటి గుమ్మానికి కట్టిన రక్ష తెగి దూరంగా కొట్టుకుపోతుంది. దీంతో వెంటనే ఆరు ఇంట్లోకి వెళ్లి రణవీర్‌ను కొట్టి వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×