E-Paper
Advertisement

Best Telugu Romantic Web Series : వాలెంటైన్స్ డే స్పెషల్… గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూడాల్సిన బెస్ట్ తెలుగు రొమాంటిక్ సిరీసులు

Best Telugu Romantic Web Series : వాలెంటైన్స్ డే స్పెషల్… గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూడాల్సిన బెస్ట్ తెలుగు రొమాంటిక్ సిరీసులు
Advertisement

Best Telugu Romantic Web Series : వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఈ స్పెషల్ డే రోజున గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూడటానికి పర్ఫెక్ట్ తెలుగు సిరీస్ లను మీ కోసం తీసుకొచ్చాము. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి సిరీస్ ప్రేమను విభిన్న కోణాల్లో చూపిస్తుంది. కార్పొరేట్ లవ్, బ్యూటీ, రొమాన్స్, కామెడీ, పెళ్లి తర్వాత ప్రేమ వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. పైగా ఈ సిరీస్‌లు రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌తో ఆకట్టుకుంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జియో సినిమా వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ సిరీస్‌లు ఏంటో చూద్దాం పదండి.

1. ది సాఫ్ట్‌వేర్ డెవ్‌ లవ్పర్ (The Software Devloveper)

2020లో విడుదలయిన తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘ది సాఫ్ట్‌వేర్ డెవ్‌ లవ్పర్’. కె. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో షన్ముఖ్ జస్వంత్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇన్ఫినిటమ్ మీడియా నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది, కానీ పూర్తి మూవీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ 10 ఎపిసోడ్‌లతో ఆకట్టుకుంటుంది. కథ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే షన్ను, కొత్తగా జాయిన్ అయిన వైష్ణవి మధ్య ప్రేమ గురించి ఉంటుంది. షన్ను వైష్ణవిని ప్రేమిస్తాడు, కానీ ఆమె అతన్ని స్నేహితుడిగా చూస్తుంది. సిరీస్ లో యువత మధ్య ప్రేమ, స్నేహం, కెరీర్ సమస్యలను సహజంగా చూపించారు. షన్ముఖ్ జస్వంత్ నటన, వైష్ణవి చైతన్య క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ సిరీస్ కే హైలైట్. వాలెంటైన్స్ డేకి గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూడటానికి బెస్ట్ ఆప్షన్. ప్రతీ ఒక్కరూ ఈ సిరీస్ కు కనెక్ట్ అవుతారు.

2. ది బేకర్ అండ్ ది బ్యూటీ (The Baker and the Beauty)

Advertisement

2021లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘ది బేకర్ అండ్ ది’. ఇప్పుడు Aha OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇజ్రాయెల్ సిరీస్ రీమేక్. జొనాథన్ జవదాన్ దర్శకత్వం వహించారు. సంతోష్ శోభన్, తినా శిల్పారాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిరీస్ 8 ఎపిసోడ్‌లతో సాగుతుంది. కథ ఒక సాధారణ బేకర్ (సంతోష్), ఫ్యాషన్ మోడల్ (తినా) మధ్య ప్రేమ, ఆ తరువాత ఏం జరిగింది అన్నది స్టోరీ. మధ్యలో కామెడీ, రొమాన్స్, కుటుంబ డ్రామా కూడా ఉంటుంది. సంతోష్ శోభన్ ఇన్నోసెంట్ నటన, తినా శిల్పారాజ్ గ్లామర్ సిరీస్ కి హైలైట్. ఆహాలో తెలుగు ఆడియోతో సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read : ఓటీటీలోకి అడుగు పెట్టిన 4100 కోట్ల మూవీ… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు

3. వైల్డ్ రొమాన్స్ (Wild Romance)

Advertisement

తెలుగు డబ్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్న కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘వైల్డ్ రొమాన్స్’. హాట్‌స్టార్ లేదా యూట్యూబ్‌లో దీన్ని చూడవచ్చు. ఈ సిరీస్ 16 ఎపిసోడ్‌లు ఉంటుంది. కథ ఒక బేస్‌బాల్ ప్లేయర్, అతని బాడీగార్డ్ మధ్య నడుస్తుంది. వారి మధ్య మొదట గొడవలు స్టార్ట్ అవుతాయి. తర్వాత రొమాన్స్ పెరుగుతుంది. లీ సి యంగ్, లీ డాంగ్ వూక్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిరీస్ ప్రేమలో అనుకోని మలుపులు, సరదా గొడవలు వంటి అంశాలతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాలెంటైన్స్ డేకి గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూస్తే సరదాగా ఉంటుంది. ప్రేమలో సరదాగా ఉండడం అన్నది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.

4. జస్ట్ మ్యారీడ్ (Just Married)

తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘జస్ట్ మ్యారీడ్’. జియో సినిమాలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కొత్త జంట మధ్య రిలేషన్‌షిప్ సమస్యలు, సరదాల చుట్టూ తిరుగుతుంది. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ లో కథ ఒక యువ జంట పెళ్లి తర్వాత ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు, ప్రేమలో అడ్జస్ట్‌మెంట్స్ గురించి ఉంటుంది. ప్రేమలో వివాహం తర్వాత జరిగే మార్పులు, మధుర క్షణాలు వంటిని స్పెషల్ గా ఉంటాయి.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×