Netflix: థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కూడా 4 వారాలు లేదా 8 వారాలలో కచ్చితంగా ఓటిటిలోకి వస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ కలిగిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఓటీటీ దిగ్గజ ప్లాట్ ఫామ్ గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ వచ్చే వారం ఏకంగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో ప్రత్యేకంగా రెండు చిత్రాలు మాత్రం థియేటర్లలో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడమే కాకుండా క్యూరియాసిటీని కూడా పెంచేసాయి. అలాంటి చిత్రాలు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. వచ్చేవారం మరి నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఆ మూడు చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్, ముత్తు కుమార్ ప్రధాన పాత్రల్లో సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. 1990ల ప్రారంభంలో గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ కథ చిన్ననాటి స్నేహితులైన రిషికాంత్, సనంత్ చుట్టూ తిరుగుతుంది. ప్రగతిశీల, కరుణామయ మలయాళీ వధువు అయిన డోరతీ సనంత్ అన్నయ్యని వివాహం చేసుకొని, వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఆమె విషాద మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెరకేక్కిన ఈ సినిమా మొదట విమర్శలు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . విమర్శకుల ప్రశంసల అందుకున్న ఈ సినిమా అక్టోబర్ 23న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులోకి రానుంది..
మలయాళ భాష టైం లూప్ కామెడీ థ్రిల్లర్ మూవీగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ధూమకేతు. యాక్షన్ కామెడీ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మేళవింపుగా వచ్చిన ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు. నిఖిలా విమల్, సజిన్ గోపు, షైన్ టామ్ చాకో, గణపతి ఎస్ పొదువాల్, సిద్ధార్థ భరతన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాంటి ఈ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 23న ఓటీటీ లోకి రానుంది . మలయాళం, తమిళ్ , హిందీ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది..
ALSO READ:ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ది ప్యారడైజ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 22న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై నెట్ ఫ్లిక్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుంది.
ఈ మూడు చిత్రాలతో పాటు ‘ప్రథమ దృష్టియా కుట్టక్కర్’ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా వచ్చేవారం స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం. మలయాళం భాషా క్రైమ్ డ్రామా మూవీగా వచ్చిన ఈ చిత్రంలో పార్వతీ తిరువోతు , మాథ్యూ థామస్, ఉన్నిమాయ ప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.