E-Paper
Advertisement

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?
Advertisement

అమెరికా ‘డాలర్’తో పోలిస్తే మన దేశ కరెన్సీ ‘రూపాయి’ విలువ ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా పరిస్థితి చేయి దాటిపోయింది. రూపాయి విలువ పడిపోయి ఎంతలా దెబ్బతిందంటే.. ఒక డాలర్ కొనాలంటే మనం ఏకంగా 97 రూపాయలు ఇవ్వాల్సిన దయనీయ స్థితికి చేరింది. మన రూపాయి బలం కోల్పోతుంటే, డాలర్ మాత్రం విపరీతంగా బలపడిపోతోంది.

ఇందుకీ సమస్య?

అసలు ఈ సమస్య ఎందుకు వస్తోందంటే? మన దేశానికి కావాల్సిన పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, గోధుమలు వంటి చాలా ముఖ్యమైన సరుకులన్నీ విదేశాల నుంచే దిగుమతి అవుతాయి. ఆ సరుకులు కొనాలంటే మనం అమెరికా డాలర్లలోనే డబ్బులు చెల్లించాలి. కానీ మన దగ్గర డాలర్లు తగ్గిపోవడం, రూపాయి విలువ పడిపోవడంతో ఆ కొనుగోళ్లు చాలా భారంగా మారుతున్నాయి. దీనివల్ల ఆటోమేటిక్‌గా మన దేశంలో అన్ని రకాల సరుకుల ధరలు పెరిగిపోయి సామాన్యుడి నడ్డి విరుగుతోంది.

ఆర్బీఐ ఏం చేస్తోంది?

Advertisement

మన రూపాయి పడిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది మన దేశ ఆర్థిక పెద్ద బ్యాంకు ‘ఆర్బీఐ’. రూపాయిని కాపాడుకోవడానికి ఏకంగా పదేళ్లలో ఎన్నడూ లేనంత కఠినంగా అడుగులు వేస్తోంది. మార్కెట్లో అందరి చేతుల్లోనూ డబ్బులు ఎక్కువైతే విలువ పడిపోతుందని భావించి.. బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పెంచేసింది. అంటే మనం బ్యాంకుల్లో దాచుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుంది, కానీ అప్పు తీసుకుంటే మాత్రం వడ్డీ భారంతో వెన్నులో వణుకు పుడుతుంది.

నిపుణులు ఏమంటున్నారు?

మన వాళ్ళు విదేశాలకు సరుకులు అమ్మి సంపాదించిన డాలర్లను ఎక్కడా దాచిపెట్టకుండా, వెంటనే ఆరు నెలల్లోగా మన దేశానికి వెనక్కి తీసుకువాలని నిబంధనలు కఠినం చేసింది. మరోవైపు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎప్పటికప్పుడు సరిచేయడం ద్వారా అనవసరమైన వాడకాన్ని తగ్గించి, విదేశాలకు వెళ్లే డాలర్ల భారాన్ని తగ్గించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Advertisement

Also Read: గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

విదేశీ ఇంధనమే దిక్కా?

ఆర్బీఐ వేస్తున్న ఈ రక్షణ కవచాల వల్ల రూపాయి పతనం తాత్కాలికంగా ఆగింది, కొంచెం కోలుకుంది. కానీ మనం విదేశీ ఇంధనం మీద ఇలాగే పూర్తిగా ఆధారపడుతూ పోతే, ఈ టెన్షన్ ఎప్పుడూ ఉండేదే అని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి మన రూపాయి విలువ నిలబెట్టడానికి ఆర్బీఐ శాయశక్తులా కృషి చేస్తోందన్నమాట.

Tags

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×