E-Paper
Advertisement

దేశంలో భానుడి ప్రతాపం.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అకోలాలో 46.9 డిగ్రీలు, తెలంగాణ మాటేంటి?

దేశంలో భానుడి ప్రతాపం.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అకోలాలో 46.9 డిగ్రీలు, తెలంగాణ మాటేంటి?
Advertisement

Weather Updates: దేశవ్యాప్తంగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి.  ఏ ప్రాంతంలో చూసినా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా అకోలా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న రోజుల్లో ఈ రికార్డు బద్దలు అవ్వడం ఖాయమనే వాదనలు లేకపోలేదు.

దేశంలో భానుడి ప్రతాపం.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Advertisement

ఈ ఏడాది మార్చి సెకండ్ వీక్ నుంచి ఎండలు దంచి కాస్తున్నాయి. రోజు రోజుకూ పగటి వేళ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాత్రి వేళ గురించి చెప్పనక్కర్లేదు. రాత్రి 12 గంటలకు నిద్ర పట్టడం లేదు.  గడిచిన మూడేళ్లు ఏప్రిల్ మాసంలో భానుడి ప్రతాపం అంతా ఇంతా కాదు. ఈసారి దక్షిణాది రాష్ట్రాల గురించి చెప్పనక్కర్లేదు.

భయటకు వెళ్లాలంటే ప్రజలు హడలిపోతున్నారు. కొద్దిరోజుల కిందట ఏప్రిల్-మే నెలలో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందని మార్చిలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అన్నట్లుగా 46 డిగ్రీలను టచ్ చేసింది.

Advertisement

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ వారంలో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నాగ్‌పూర్‌లోని వాతావరణ శాఖ చెబుతున్నమాట. ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు చేరుకోవచ్చని తెలిపింది.

అకోలాలో 46.9 డిగ్రీలు.. జైసల్మేర్ ప్రాంతాల్లో 46.4 డిగ్రీలు

కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పింది. అన్నట్టుగానే ఆదివారం దేశంలో అత్యధికంగా అకోలాలో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మహారాష్ట్రలో అమరావతి ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వార్దా, యవత్మాల్‌లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నాగ్‌పూర్‌లో 45.4, చంద్రాపూర్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక విదర్భ ప్రాంతంలో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఈ ప్రాంతంలో మంగళవారం వరకు వడగాలుల ప్రభావం ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.

ఇక రాజస్థాన్ పరిస్థితి అదే విధంగా ఉంది. బార్మర్, జైసల్మేర్ ప్రాంతాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ 26 ఆదివారం ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ALSO READ: ఢిల్లీ లిక్కర్ కేసు మరొక మలుపు.. ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాను, కేజ్రీవాల్ సంచలన నిర్ణయం 

టీజీడీపీఎస్ గణాంకాల ప్రకారం.. మరో 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగిలిన 11 జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ ప్రాంతం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 44.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఆ తర్వాత నల్గొండలోని అనుముల్ హాలియా, నిర్మల్‌లోని సారంగాపూర్, నిజామాబాద్‌లోని కమ్మర్‌పల్లి, జగిత్యాలలోని ధర్మపురి, కుమారం భీమ్ ఆసిఫాబాద్లో లోని కెరమెరి 44.1 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. రాజన్న సిరిసిల్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×