E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నిహారిక రాకాస.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నిహారిక రాకాస.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Rakasa Movie OTT:  నిహారిక.. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఉమేష్ కుమార్ బన్సాల్ తో నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్ హీరోగా లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. దీనికి కారణం నిహారిక, మానస శర్మ అనే చెప్పాలి. నిహారిక తోపాటు చిత్ర బృందం పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్లు చేయడం.. అటు సినిమా ప్రమోషన్స్ లో మానస శర్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం రెండూ కూడా సినిమాకి ప్లస్ గా మారాయి. అలా ఫాంటసీ హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నిహారిక రాకాస..

మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు మూడు వారాలు అవుతుంది. ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో కూడా చూడాలని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల కోరిక తీర్చడానికి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మేరకు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర బృందంతో అగ్రిమెంటు చేసుకున్నట్లు సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ చివరి వారం లేదా మే రెండవ వారంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై నెట్ ఫ్లిక్స్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

ALSO READ:పెళ్లి కాదు.. దాన్ని మాత్రమే చూడండి.. రూమర్స్ పై సంయుక్త రియాక్షన్!

రాకాస సినిమా స్టోరీ..

సినిమా విషయానికి వస్తే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరు (సంగీత్ శోభన్).. తన ప్రేయసి సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరు కి వస్తాడు. అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి సిద్ధమవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలో సోము (వెన్నెల కిషోర్) అనే వ్యక్తిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్పోర్టుని పోలీసులు తీసుకెళ్లిపోతారు. సోము జాడను కనిపెడితే తన పాస్పోర్ట్ తిరిగి వస్తుందని స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్ట వేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి ఆ టైంలో వస్తుంది. దీంతో ఆ ఊరంతా కలిసి ఒక ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న చివరి క్షణంలో అతడు చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉంటుంది . అయితే వీరు అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరు ఆ కోటలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత ఏం జరిగింది ? అసలు ఆ కోట ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి ? నిజంగానే బ్రహ్మ రాక్షసుడు ఆ కోటలో ఉన్నాడా? ఈ ప్రయాణంలో సుబ్బలక్ష్మి (నయన్ సారిక)తో పరిచయం ఎలా ఏర్పడింది? ఆమె ఎందుకు కోటలోకి వెళ్ళింది? సోము సంగతి ఏమయింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×