E-Paper
Advertisement

కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు!

కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు!
Advertisement

Bus Accident: కరీంనగర్ నగర శివార్లలోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ చౌరస్తాకు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు.

Advertisement

అంబులెన్స్ సాయంతో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రియుడితో దాగుడుమూతల ఆట.. ఇంటికి పిలిచి, ఆ పని కానిచ్చిన ప్రియురాలు

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×