E-Paper
Advertisement

వందే భారత్ క్రేజ్.. ఉత్తరాన్ని మించిపోయిన దక్షిణ భారతం!

వందే భారత్ క్రేజ్.. ఉత్తరాన్ని మించిపోయిన దక్షిణ భారతం!
Advertisement

Most Used Vande Bharat Trains: భారతీయ రైల్వేల్లో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఉతరాదితో పోల్చితే, దక్షిణాదిలో రైల్వే వినియోగం ఎక్కువగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఉపయోగించిన టాప్ 10 రైళ్లలో దక్షిణ రైల్వేకు చెందిన పలు రైళ్లు చోటు సంపాదించాయి. ముఖ్యంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ జాబితాలో కీలక పాత్ర పోషించాయి.

వందేభారత్ రైళ్లకు మంచి గుర్తింపు

వందే భారత్ రైళ్లు దేశంలో సెమీ హైస్పీడ్ సర్వీసులుగా మంచి గుర్తింపు పొందాయి. ప్రయాణికుల సౌకర్యం, వేగం, టైమ్ మెయింటెనెన్స్ లాంటి కారణాలతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. కొన్ని మార్గాల్లో ఈ రైళ్ల ఆక్యుపెన్సీ 100 శాతం దాటింది. అంటే, సీట్లు పూర్తిగా నిండిపోవడమే కాకుండా, వెయిటింగ్ లిస్టులు కూడా పెరుగుతున్నాయి. 2025–26లో  ఈ రైళ్లు దాదాపు 3.98 కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లినట్లు రైల్వే లెక్కలు చెప్తున్నాయి.

కేరళ, తమిళనాడులో ఎక్కువ ఆదరణ

Advertisement

దక్షిణాదిలో కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రైల్వే సేవలకు ఎక్కువ ఆదరణ ఉంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, మంగళూరు లాంటి నగరాలను కలిపే మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో వేగవంతమైన ప్రత్యామ్నాయ రవాణా అవకాశాలు తక్కువగా ఉండటంతో, ఎక్కువ మంది రైల్వే ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే రైళ్లలో సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఖర్చు కూడా తక్కువగా ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు.

ఎక్స్ ప్రెస్ రైళ్లకూ మంచి ఆదరణ

వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లు మాత్రమే కాకుండా, సాధారణ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. దక్షిణ రైల్వేకు చెందిన తొమ్మిది ఎక్స్‌ ప్రెస్ రైళ్లు కూడా అత్యధిక ఆక్యుపెన్సీ జాబితాలో చోటు దక్కించుకోవడం ఈ విషయాన్ని బలోపేతం చేస్తున్నాయి. అంటే అన్ని వర్గాల ప్రయాణికులు రైల్వేలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని స్పష్టమవుతోంది.

టిక్కెట్లు దొరక్క ప్రయాణికుల అవస్థలు

Advertisement

మరోవైపు పెరుగుతున్న డిమాండ్ కొన్ని సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ఎక్కువ రైళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతం దాటిపోవడం వల్ల ప్రయాణికులకు టికెట్లు దొరకడం కష్టమవుతోంది. వెయిటింగ్ లిస్టులు పెరగడం, రద్దీ ఎక్కువ కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులు ప్రవేశపెట్టడం, కోచ్‌ల సంఖ్య పెంచడం వంటి చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా దక్షిణాదిలో రైల్వే వినియోగం గణనీయంగా పెరుగుతోంది. వందే భారత్ వంటి ఆధునిక రైళ్ల ప్రవేశంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది. భవిష్యత్తులో ఈ డిమాండ్‌ను తీర్చేందుకు మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్.. ఉదయం 5 గంటలకే మెట్రో సేవలు!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×