OTT Movie : బాల్ థాక్రే మనవడు ఐశ్వరీ థాక్రే నటించిన ‘నిషాంచి’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ద్విపాత్రాభినయంతో ఈ సినిమాలో నటుడిగా మంచి మార్కులే కొట్టాడు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ థియేటర్లలో అడుగుపెడితే, రెండవ పార్ట్ ని మాత్రం థియేటర్లకు వెళ్లకుండానే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు పార్ట్ లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్, సస్పెన్స్, లవ్ స్టోరీ థీమ్స్ తో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘నిషాంచి’ (Nishaanchi ) 2025లో రిలీజ్ అయిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అనురాగ్ కశ్యప్ (గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్ ఫేమ్) దర్శకత్వంలో ఐశ్వరీ థాక్రే మోనికా పాన్వర్, వేదికా పింటో ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 55 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.5/10 రేటింగ్ ని పొందింది. 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నవంబర్ 14 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పుర్ లో మొదలవుతుంది. బాబ్లూ, డాబ్లూ అనే ట్విన్ బ్రదర్స్ చూడటానికి అచ్చం ఒకేలా కనిపిస్తుంటారు. ఇద్దరూ ఒకే తల్లిదండ్రులకి పుట్టారు కానీ పూర్తిగా వేర్వేరు స్వభావాలతో ఉంటారు. బాబ్లూ చిన్నప్పటి నుంచి రౌడీ, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. కానీ డాబ్లూ అలా కాదు, చాలా మంచివాడు. బాబ్లూ ఒక రోజు గ్యాంగ్‌స్టర్ అంబికా ప్రసాద్ గ్యాంగ్‌లో చేరతాడు. అంబికా ప్రసాద్ అతని డేర్ ని చూసి, ఒక పెద్ద శత్రువుని చంపమంటాడు. బాబ్లూ డబ్బు కోసం అతన్ని చంపేస్తాడు. కానీ ఆ శత్రువు కూతురుతో బాబ్లూ ప్రేమలో పడతాడు. మరోవైపు డాబ్లూ ఇంట్లో ఉండి, అన్నయ్య చేసే దోపిడీలు, నేరాల గురించి ఆందోళన పడుతుంటాడు. బాబ్లూ అంబికా కూతురుతో కూడా చనువుగా ఉంటాడు. ఇక్కడి నుంచి ట్విస్ట్‌లు మొదలవుతాయి.
Read Also : ఇంట్లోనే శవాన్ని పూడ్చి పెట్టే మెంటల్ ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ
బాబ్లూ చంపిన శత్రువు కూతురుకి తండ్రి మరణం గురించి తెలుస్తుంది. ఆమె బాబ్లూ మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. అంబికా కూడా బాబ్లూ రహస్యంగా తన కూతురితో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇప్పుడు బాబ్లూ రెండు వైపులా ట్రాప్ అవుతాడు. ఇక డాబ్లూ అన్నయ్యని కాపాడాలని గ్యాంగ్‌లోకి వస్తాడు. ఇద్దరూ ఒకేలా కనిపించడం వల్ల గందరగోళం మొదలవుతుంది. క్లైమాక్స్‌లో బాబ్లూ, డాబ్లూ ఒకరినొకరు కాపాడుకుంటూ పోరాడతారు. ఇప్పుడు బాబ్లూ చంపిన శత్రువు కూతురు నిజానికి డాబ్లూ ప్రేమికురాలు అని ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్ తో అన్నదమ్ములు షాక్ అవుతారు. చివరికి ఈ లవ్ స్టోరీ ఏమవుతుంది ? గ్యాంగ్ వార్ లో వీళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.