E-Paper
Advertisement

OTT Movie : ఇంట్లోనే శవాన్ని పూడ్చి పెట్టే మెంటల్ ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : ఇంట్లోనే శవాన్ని పూడ్చి పెట్టే మెంటల్ ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : దెయ్యాలు, చేతబడుల వంటి సినిమాలకు ఇండోనేషియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా ఫేమస్. ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువగా ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకే ఎక్కడా లేని బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్స్ ఇక్కడి సినిమాలలోనే చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక ఇండోనేషియన్ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ని బాగా భయపెడుతోంది. ఈ కథ ఒక ఫ్యామిలీ శాపం చుట్టూ తిరుగుతుంది. ఇండోనేషియన్ హారర్ ఫ్యాన్స్‌కి ఇదొక వన్ టైమ్ వాచ్ మూవీ. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో ఉందంటే

‘సోరోప్’ (Sorop) 2024లో వచ్చిన ఇండోనేషియన్ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇది ఉపి అవియాంటో దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో హానా మలాసన్ (హనిఫ్), యాసమిన్ జాసెం (ఇస్తి), ఎగి ఫెడ్లీ (పాక్డే ఖైర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 డిసెంబర్ 19న ఇండోనేషియా థియేటర్స్ లో విడుదలైంది. 1 గంట 43 నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 5.5/10 రేటింగ్ పొందింది. Netflix, Plexలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హనిఫ తన చెల్లి ఇస్తి తో కలసి జకార్తాలో ఉంటుంది. ఒక రోజు వాళ్ల అంకుల్ పాక్డే ఊర్లో చనిపోయాడని ఫోన్ వస్తుంది. ఇక వారసత్వంగా ఇళ్ళు, భూమి వాళ్లకే వచ్చేస్తాయి. ఇద్దరూ కలసి ఊరు వెళ్తారు. కానీ ఆ ఊరును చూడగానే వీళ్ళకి భయం వేస్తుంది. చీకటి అయ్యాక పిల్లలు బయటకు రాకూడదని, రెడ్ బుక్‌లో రాసిన “సోరోప్” అనే రిచ్యువల్ ఫాలో అవ్వాలని ఊరి పెద్దలు వీళ్ళకు చెబుతారు. ఇక ఇంట్లోకి వెళ్ళాక మొదటి రాత్రే అంకుల్ ఖైర్ గోస్ట్‌లా కనిపిస్తాడు. ఆ ఘోస్ట్ నోటి నుంచి మట్టి వాంతి చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సీన్ చూసి ఇస్తి భయపడి ఏడుస్తుంది. హనిఫ ధైర్యంగా దీని సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటుంది. ఇంట్లో ఒక పాత రెడ్ బుక్ దొరుకుతుంది. అందులో ఫాస్టింగ్, రాత్రి బయటకు రాకూడదు, ఎవరైనా చనిపోతే వాళ్ల శరీరంలో మట్టి నింపి కాల్చివేయాలి అనే రిచ్యువల్ రూల్స్ ఉంటాయి. అంకుల్ ఖైర్ ఈ రూల్స్ పాటించకుండా చనిపోయాడని తెలుస్తుంది. అందుకే అతని ఆత్మ ఇప్పుడు దుష్ట ఆత్మగా మారింది. ఇద్దరూ భయపడి ఊరు వదిలి వెళ్లాలనుకుంటారు. కానీ ఆస్తి పేపర్స్ కోసం ఇంకో రెండు రోజులు ఉండాల్సి వస్తుంది.

Read Also : అమ్మాయిల వరుస హత్యలు… ఆ పార్ట్స్ కోసి చంపే సైకో… బ్రూటల్ మర్డర్ మిస్టరీ

రెండో రాత్రి మరింత భయంకరంగా ఉంటుంది. అంకుల్ గోస్ట్ ఇంట్లోకి వచ్చి వీళ్ళని మరింత భయపెడుతుంది. సోరోప్ అంటే ఫ్యామిలీ శాపం అని తెలుసుకున్న హనిఫ ఎవరైనా రిచ్యువల్ బ్రేక్ చేస్తే, మట్టి వాంతి చేసి చచ్చిపోతరని తెలుసుకుంటుంది. వాళ్ల తాత గతంలో భూమి కోసం ఒక గోస్ట్‌తో ఈ రిచ్యువల్ స్టార్ట్ చేశాడు. అంకుల్ పాక్డే ఆ డీల్ బ్రేక్ చేసి చనిపోయాడు. ఇప్పుడు గోస్ట్ రివెంజ్ మోడ్ లో ఉంటుంది. ఇక ఇస్తి మట్టి వాంతి చేయడం స్టార్ట్ చేస్తుంది. హనిఫ ఆ రిచ్యువల్ ను రివర్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దాని కోసం రాత్రి 3 గంటలకు అంకుల్ శరీరం నుంచి మట్టి తీసి, రెడ్ బుక్‌లో రాసిన మంత్రం చదవాల్సి ఉంటుంది. ఇది మరింత భయంకరంగా జరుగుతుంది. చివరికి ఈ అక్కా చెల్లెళ్ళు అంకుల్ ఘోస్ట్ నుంచి బయట పడతారా ? ఆస్తులు సొంతం చేసుకుంటారా ? క్లైమాక్స్ రిచ్యువల్ ఎలాంటి మలుపు తీసుకుంటుంది ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×