BigTV English

OTT Movie : భర్తను వదిలి డబ్బు కోసం మరొకరితో ఆ పని… భర్త రివేంజ్ చూస్తే అలాంటి పని చేయాలన్న ఆలోచనకే వణికిపోతారు

OTT Movie : భర్తను వదిలి డబ్బు కోసం మరొకరితో ఆ పని… భర్త రివేంజ్ చూస్తే అలాంటి పని చేయాలన్న ఆలోచనకే వణికిపోతారు

OTT Movie : హాలీవుడ్ సినిమాలకి మన ప్రేక్షకులు ఎప్పటినుంచో అభిమానులుగా ఉన్నారు. మార్వెల్, యాక్షన్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను థియేటర్లలో చూడకపోయినా, ఓటిటిలో మాత్రం మిస్ కాకుండా చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ హాలీవుడ్ సినిమాలకు, మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తో వచ్చింది. ఈ మూవీలో డబ్బు లేని కారణంగా ప్రేమించే భర్తని వదిలేసి, మరొకరిని పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్. ఆమెకు తనదైన స్టైల్లో బుద్ధి చెబుతాడు హీరో. చూసే కొద్ది సినిమాలో లీనమైపోతారు మూవీ లవర్స్. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నాక్టర్నల్ యానిమల్స్‘  (Nocturnal Animals). 2016 లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి టామ్ ఫోర్డ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అమీ ఆడమ్స్, జేక్ గిల్లెన్‌హాల్, మైఖేల్ షానన్, ఆరోన్ టేలర్-జాన్సన్, ఇస్లా ఫిషర్, ఆర్మీ హామర్, లారా లిన్నీ నటించారు. హీరోయిన్ తన మొదటి భర్త వ్రాసిన కొత్త నవలని చదివి, వారి బంధానికి మధ్య ఉన్న సారూప్యతలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. 73వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీలో సెప్టెంబర్ 2, 2016న ప్రదర్శించబడి, గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ ను గెలుచుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. డబ్బు లేని కారణంగా హీరోని వదిలేస్తుంది హీరోయిన్. ఆ తర్వాత ఒక డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ డబ్బున్న వ్యక్తి బిజినెస్ కి టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటాడు. భార్యను పెద్దగా పట్టించుకోకపోవడంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో హీరో ఒక రచయిత కావడంతో, ఒక నవల రాసి మొదటిగా హీరోయిన్ కి పంపుతాడు. ఈ నవలని పబ్లిష్ చేసేముందు, నువ్వు చదవాలని కోరుకుంటున్నాను అని అందులో రాసి ఉంటుంది. అది చూసి పక్కన పెట్టి హీరోయిన్, తన భర్తతో ఒక పార్టీకి వెళ్లాలనుకుంటుంది. బాగా బతిమాలడంతో భర్త పార్టీకి వచ్చి, అంతలోనే పని ఉందంటూ మళ్ళీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఇంటికి వచ్చి మాజీ భర్త రాసిన నవలను చదువుతుంది. ఆ నవలను చదువుతున్నంత సేపు ఆమె బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అంత బాగా రాసి ఉంటాడు తన మాజీ భర్త. ఈ స్టోరీలో హీరో తన భార్య, కూతురుతో ఒక వెకేషన్ కి వెళ్తుంటాడు. రోడ్డు మార్గంలో కొంతమంది ఆకతాయిలు భార్య పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. హీరో వాళ్లని వెతికే క్రమంలో భార్య, కూతురు ఒకచోట శవాలై కనిపిస్తారు. ఈ కేసును ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. చంపిన వాళ్ళని పట్టుకోడానికి హీరో చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.

ఈ స్టోరీ ఇలా రన్ అవుతుంటే, హీరోయిన్ ఈ స్టోరీ నన్ను ఊహించే రాశాడని అనుకుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. కేవలం డబ్బు లేని కారణంగా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని, కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపుకుంటుంది హీరోయిన్. ఇది తెలిసి హీరో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటాడు. అందులో నుంచి పుట్టుకొచ్చింది ఈ నవల. చివరికి ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని తప్పు చేశానని ఫీలవుతూ ఉంటుంది హీరోయిన్. ఒక రెస్టారెంట్ లో కలుద్దామని హీరోకి మెయిల్ చేసి వెయిట్ చేస్తుంటుంది. ఎంతసేపు వెయిట్ చేసినా హీరో రాకపోవడంతో చాలా బాధపడుతుంది. అప్పుడే అర్థమవుతుంది హీరోయిన్ కి నేను అతన్ని దూరం పెట్టినప్పుడు, అతడు ఎంత బాధపడ్డాడో తెలియాలనే ఇప్పుడు రాలేదని అనుకుంటుంది. ఈ మూవీ స్టోరీ ని ఇంకా బాగా ఫీల్ అవ్వాలంటే, ‘నాక్టర్నల్ యానిమల్స్’  (Nocturnal Animals) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

 

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×