BigTV English

Kobbari Bobbattu Recipe: తీపిగా ఏదైనా తినాలనిపిస్తోంది? కొబ్బరి బొబ్బట్లు ట్రై చేయండి రుచిగా ఉంటాయి

Kobbari Bobbattu Recipe: తీపిగా ఏదైనా తినాలనిపిస్తోంది? కొబ్బరి బొబ్బట్లు ట్రై చేయండి రుచిగా ఉంటాయి

ఎలాంటి ఆహారాలు తిన్న అప్పుడప్పుడు స్వీటు తినాల్సిందే. అలా అని స్వీట్లు పూర్తిగా బయట కొనుక్కొని తింటే ఎలా కొన్నిసార్లు ఇంట్లో కూడా వండుకోవాలి. బొబ్బట్లు లేదా భక్ష్యాలు వీటి పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇప్పుడు ఒకేలాంటి బొబ్బట్లు కాకుండా ఒకసారి ఈసారి కాస్త ప్రత్యేకంగా కొబ్బరి బొబ్బట్టు వండేందుకు చూడండి. కొబ్బరి బొబ్బట్లు బయట మార్కెట్లో దొరకవు. మీరు ఇంట్లోనే వండుకోవాలి. చాలా సులువుగా కొబ్బరి బొబ్బట్లు వండేయచ్చు. వీటి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


కొబ్బరి బొబ్బట్టు రెసిపీకి కావలసిన పదార్థాలు
మైదా లేదా గోధుమపిండి – ఒక కప్పు
నెయ్యి – పావు కప్పు
ఉప్పు – చిటికెడు
యాలకుల పొడి – అర స్పూను
కొబ్బరి తురుము – ఒక కప్పు
బెల్లం తురుము – ఒక కప్పు
పసుపు – నీళ్లు తగినన్ని
నూనె – ఒక స్పూను

కొబ్బరి బొబ్బట్టు రెసిపీ
⦿ మైదా లేదా గోధుమపిండి రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు.
⦿ మార్కెట్లో మైదాతోనే అధికంగా చేస్తారు, కానీ మైదాని వాడడం ఆరోగ్యానికి హానికరం.
⦿ కాబట్టి గోధుమ పిండిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
⦿ గోధుమపిండిలో ఉప్పు, పసుపు ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.
⦿ కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుతూ దాన్ని పూరీ పిండిలాగా కలుపుకోవాలి.
⦿ కాకపోతే కాస్త పల్చగా వచ్చేలా చూసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నూనె వేయడం మర్చిపోవద్దు.
⦿ కొబ్బరి నూనె వేస్తే మరీ మంచిది. ఒక 20 నిమిషాల పాటు ఈ పిండిని మూత పెట్టి పక్కన పెట్టేయాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం తురుమును వేయాలి.
⦿ అలాగే నీళ్లు కూడా వేసి బెల్లాన్ని కరిగేలా చేయాలి.
⦿ బెల్లం నీళ్ళల్లాగా కరిగాక అందులో ఉన్న మలినాలను తీసేయాలనుకుంటే దీన్ని చల్లార్చి వడకట్టవచ్చు.
⦿ ఎలాంటి మరణాలు లేకపోతే అలానే ఉంచి వేడి చేయాలి.12.  ఇప్పుడు అందులో తాజా కొబ్బరి తురుమును, యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇదంతా దగ్గరగా గట్టిగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
⦿ ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంత ముద్దను తీసి చిన్న పూరీలాగా వత్తాలి.
⦿ మధ్యలో ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి మడత పెట్టాలి.
⦿ ఇప్పుడు దాన్ని మళ్ళీ బొబ్బట్లులాగా ఒత్తుకోవాలి.
⦿ స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో ఒత్తుకున్న బొబ్బట్లు రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి.
⦿ తర్వాత తీసి ప్లేట్లో వేయాలి. పైన నెయ్యిని అద్దాలి.
⦿ అంతే టేస్టీ కొబ్బరి బొబ్బట్లు రెడీ అయినట్టే. దీన్ని  వండుతున్నప్పుడే నోరూరిపోతుంది.
⦿ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.
⦿ ఈ కొబ్బరి బొబ్బట్లు అతిథులకు వడ్డించి చూడండి. కచ్చితంగా నచ్చుతాయి.


ముఖ్యంగా పండుగలు, ఇంట్లో పుట్టినరోజులు, పెళ్లిరోజులు ఇతర వేడుకల సమయంలో స్వీట్లు కొనేకన్నా ఇలా కొబ్బరి బొబ్బట్లు చేసి పెడితే శుచిగాను, శుభ్రంగాను టేస్టీగాను వస్తాయి. వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే మైదాపిండి బదులు గోధుమ పిండిని వాడడమే ఉత్తమమని గుర్తుపెట్టుకోండి. మైదాలో రసాయనాలు ఉంటాయి. బయట మార్కెట్లో కేవలం మైదాతో చేసిన బొబ్బట్లు మాత్రమే లభిస్తాయి. కాబట్టి ఇంట్లోనే ఆరోగ్యకరంగా గోధుమ పిండితో బొబ్బట్లు లేదా భక్ష్యాలను చేసుకోవడం ఉత్తమం.

Also Read:  నోరూరించే ఓట్స్ పకోడీ.. దీన్ని చేయడం చాలా ఈజీ

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×