Top Actress : టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని కొందరు అంటుంటారు..? అది నిజమే అని చాలా మంది నిరూపించుకున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలి అంటే ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే వేరే ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఇక మన ఇండియన్ యాక్టర్స్ ఒక ఇండస్ట్రీలో మాత్రమే కాదు. వేరే ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొందరు నార్త్లో సత్తాను చూపిస్తే, మరికొందరు సౌత్ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇక కొందరేమో ఏకంగా హాలీవుడ్లో సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. హాలీవుడ్ లో అవకాశాలు రావడం అంటే మామూలు విషయం కాదు.. గతంలో కూడా మన భారత నటులు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. కొందరు యాక్టర్స్ హాలీవుడ్ లో కూడా నటిస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఏ సినిమాలో నటిస్తున్నారు? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
సమంత..
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోయిన్ గా తెలుగులో ఏంటో ఇచ్చిన కూడా పలు ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈమె ఈమధ్య బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సామ్ హాలీవుడ్ సినిమాలో కూడా నటించింది అన్న విషయం అందరికీ తెలిసిందే. “అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్” అనే మూవీలో బైసెక్సువల్ పాత్రలో నటించింది..
అలియాభట్..
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ హిందీ తో పాటు తెలుగులో కూడా సినిమా చేసింది. హాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసింది. “హార్ట్ ఆఫ్ స్టోన్” అనే హాలీవుడ్ కిల్లర్ మూవీ లో యాక్ట్ చేసింది అలియాభట్. మూవీ రిలీజ్ కాలేదు..
రజినీకాంత్..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు తమిళ్ తో పాటు హాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేశారన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన హాలీవుడ్లో “బ్లడ్ స్టోన్” అనే మూవీ లో నటించారు.
అమితాబచ్చన్..
బాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ బాద్షా అమితాబచ్చన్ హిందీ తో పాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈయన హాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేశారు. “ద గ్రేట్ గాడ్స్ బై” అనే చిత్రంలో నటించారు.
ధనుష్..
తమిళ హీరో ధనుష్ తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించి తన సత్తాను చాటుకున్నాడు. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ధనుష్ ఇటు తెలుగు, తమిళ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమా చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ హాలీవుడ్ లో నటించిన సినిమాలు ” దా ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ పకీర్ , ద గ్రే మ్యాన్ ” వంటి సినిమాల్లో నటించారు..
వీళ్లే కాదు చాలామంది హాలీవుడ్ లో కూడా తమ సత్తాను చాటుకున్నారు.. అందులో అనుపమ కేర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, అమ్రిష్ పూరి వంటి స్టార్స్ కూడా హాలీవుడ్లో పలు సినిమాలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు..