E-Paper
Advertisement

OTT Movie: కథలు వింటూ సైకో పనులు చేసే మంత్రగత్తె… రాత్రయితే వణికిపోయే అబ్బాయి

OTT Movie: కథలు వింటూ సైకో పనులు చేసే మంత్రగత్తె… రాత్రయితే వణికిపోయే అబ్బాయి
Advertisement

OTT Movie : చిన్న పిల్లలకి హారర్ మూవీలు చూపిస్తే ఎలా ఉంటుంది? అందులోను ఆ స్టోరీ మ్యాజికల్ మిక్స్ అయితే అది పర్ఫెక్ట్ గేట్‌వే అవుతుంది. పిల్లలకి బాగా సూట్ అయ్యే ఇలాంటి కథ ఓటీటీలో ఉంది. మనం మామూలుగా పిల్లలకి దెయ్యాల కథలు చెబుతుంటాం. పిల్లలు కూడా వీటిని చాలా ఇంట్రెస్టింగా వింటుంటారు. అయితే ఇందులో ఒక మంత్రగత్తె పిల్లావాడిని దెయ్యం కథలు చెప్పమని భయపెడుతుంది. చివరికి ఆ విచ్ నుంచి ఆ పిల్లాడు, ఎలా బయట పడతాడనేదే ఈ కథ. ఈ సినిమాను చూస్తే హారర్ ఇలా క్యూట్‌గా ఉంటుందా? అని ఆలోచిస్తారు. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2021లో వచ్చిన ఈ అమెరికన్ చైల్డ్రన్స్ హారర్ ఫ్యాంటసీ మూవీ పేరు ‘నైట్‌బుక్స్’. డేవిడ్ యారోవెస్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విన్స్లో ఫెగ్లీ, లిడ్యా జ్యూట్, క్రిస్టెన్ రిటర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2021సెప్టెంబర్ 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 100 నిమిషాల నిడివితో ఐయండిబిలో 5.8/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అలెక్స్ అనే 11 ఏళ్ల పిల్లవాడికి హారర్ స్టోరీలు రాయడం అలవాటు. అతను తన రూమ్‌లోనే “నైట్‌బుక్స్” అని పేరు పెట్టి హారర్ కథలు రాస్తూ టైమ్ పాస్ చేస్తాడు. ఒక రోజు అతని అన్న యాస్మిన్ తో కలిసి ఒక బుక్ స్టోర్‌కి వెళ్తారు. అక్కడ అలెక్స్‌కి ఒక పాత “నైట్‌బుక్” దొరుకుతుంది. అందులో హారర్ స్టోరీలు రాసి ఉంటాయి. అలెక్స్ ఆ బుక్ తీసుకువచ్చి ఇంట్లో చదువుతూ ఉంటే, ఒక్కసారిగా ఆ బుక్ మూసుకుపోతుంది. ఒక భయంకరమైన విచ్ అతని ముందు కనిపిస్తుంది. విచ్ అతన్ని తన మ్యాజికల్ అపార్ట్‌మెంట్‌లో లాక్ చేస్తుంది. విచ్ అతనితో నీకు హారర్ స్టోరీలు రాయడం అలవాటు కదా, ఇక నుంచి ప్రతి రాత్రి నాకు ఒక కొత్త స్టోరీ చెప్పు లేదంటే చంపేస్తా అని షాక్ ఇస్తుంది.

Read Also : థియేటర్లలో ధనుష్ కొత్త సినిమా… పాష్ పిల్లకు ఫైటర్‌తో లింకు… ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?

అలెక్స్ భయంతో మొదటి రాత్రి ఒక స్టోరీ చెప్తాడు. విచ్ మరో రోజు మళ్లీ చెప్పమని డిమాండ్ చేస్తుంది. ఆ విచ్ నుంచి బయటకు ఎవరూ వెళ్లలేరు. ఇక ప్రతి రాత్రి అలెక్స్ కొత్త స్టోరీ చెప్పాలి, లేకపోతే విచ్ అతన్ని చంపేస్తుంది. చివరి రాత్రి అలెక్స్ ఒక స్పెషల్ స్టోరీ చెప్పి విచ్‌ కి షాక్ ఇస్తాడు. ఆ స్టోరీలో విచ్ పాస్ట్ రివీల్ అవుతుంది. ఇప్పుడు అలెక్స్ కి బయటికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. చివరికి అలెక్స్ ఆ విచ్ నుంచి బయట పడతాడా ? విచ్ గతం ఏమిటి ? క్లైమాక్స్ కథలో ఏముంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

 

 

 

 

 

Related News

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×