Thriller Movie OTT : థ్రిల్లర్ సినిమాలకి ఉన్న ఫాలోయింగ్ వేరే సినిమాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఈ సినిమాలను చూస్తేనే పెరిగిపోతుంది. ఆఫీస్ వర్క్ ప్రధాన అంశంతో తెరకెక్కిన ఓ కొరియన్ సినిమా, మైండ్ గేమ్ తో డార్క్ షేడ్స్ బాగా చూపించింది. ఆఫీస్ పాలిటిక్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో స్టోరీ క్రీపీగా ఉంటుంది. ఆఫీస్ లో ఒక్కొక్కరు దారుణంగా హత్యకు గురవుతుంటారు ఈ కథలో. నైట్ టైమ్ సీన్స్ వణుకు పుట్టిస్తూ టెన్షన్ క్రియేట్ చేస్తాయి. హారర్ ప్రియులకు ఈ సినిమా మంచి ఛాయిస్. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
2015లో విడుదలైన ఈ సౌత్ కొరియన్ స్లాషర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఆఫీస్’ (Office). ఈ సినిమాకు హాంగ్ వాన్-చాన్ దర్శకత్వం వహించారు. ఇందులో గో ఆ-సంగ్ (లీ మి-రే – ఇంటర్న్), పార్క్ సంగ్-వూంగ్ (డిటెక్టివ్ జాంగ్-హూన్), బే సంగ్-వూ (కిమ్ బ్యాంగ్-గూక్ – సేల్స్ మేనేజర్ & కిల్లర్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2015లో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. ఈ మూవీ ఐయండిబిలో 6.0/10 రేటింగ్ తో కార్పొరేట్ వర్క్ ప్రెషర్ చర్చించినందుకు ప్రశంసలు పొందింది. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.
Read Also : గ్రామంలో వరుసగా అమ్మాయిల మిస్టీరియస్ చావులు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్
సియోల్‌లో ఒక ఫుడ్ కంపెనీ ఆఫీస్‌లో కిమ్ బ్యాంగ్ అనే వ్యక్తి సేల్స్ మేనేజర్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఇంటికి వెళ్లి కోపంతో తన భార్య, కూతురు, తల్లి అందరినీ హామర్‌తో బ్రూటల్‌గా చంపేస్తాడు. మరుసటి రోజు ఆఫీస్‌కు వచ్చి హైడ్ అవుతాడు. డిటెక్టివ్ జాంగ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆఫీస్ సిసిటివీలో కిమ్ ఎంటర్ అయ్యాడు కానీ ఎగ్జిట్ కాలేదు, కాబట్టి అతను ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నాడని జాంగ్ అనుమానిస్తాడు. దీంతో ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ భయంలో ఉంటారు. ఇంతలోనే మరిన్ని మర్డర్స్ జరుగుతాయి.
అదే ఆఫీస్ లో పనిచేసే లీ మి-రే అనే హార్డ్ వర్కర్ అమ్మాయితో మాత్రమే కిమ్ మంచిగా ఉండేవాడు. కానీ కోలీగ్స్ ఆమెను ఇగ్నోర్ చేస్తూ, ఏడిపించే వాళ్ళు. ఆమెకు పర్మనెంట్ జాబ్ ఇస్తారని అందరికీ అసూయ ఉండేది. అయితే ఇప్పుడు క్రమంగా ఆఫీస్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరుగా మర్డర్ అవుతారు. కిమ్ హైడ్ అయి వాళ్లను టార్గెట్ చేస్తాడు. కథలో కార్పొరేట్ కల్చర్ వర్క్ స్ట్రెస్ మనిషిని ఎలా మారుస్తుంది అని చూపిస్తుంది. క్లైమాక్స్‌లో కిల్లర్ మోటివ్ షాకింగ్ ట్విస్ట్ తో రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? డిటెక్టివ్ కిమ్ ని ఎలా పట్టుకుంటాడు ? కిమ్ ఎందుకు ఒక్కొక్కరిని దారుణంగా చంపాడు ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.