Best Mileage CNG Cars 2025: దేశీ మార్కెట్లో బోలెడ్ CNG కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొన్ని కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వీటిలో మారుతి సుజుకి సెలెరియో నుంచి వ్యాగన్‌ఆర్ CNG, మారుతి సుజుకి ఆల్టో K10 వరకు ఉన్నాయి.
మారుతి సెలెరియో పెట్రోల్ వెర్షన్ తో పాటు CNG ట్రిమ్ లోనూ మంచి మైలేజ్ అందిస్తుంది. సెలెరియో CNG దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగి కారుగా గుర్తింపు తెచ్చుకుంది. CNG ట్రిమ్ 1-లీటర్ యూనిట్‌ను అందిస్తుంది. ఈ కారు ఏకంగా 35.6 కి.మీ మైలేజీని అందిస్తున్నాయి. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. ఈ కారులో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి ప్యూయెల్ టైప్ CNG. హ్యాచ్ బ్యాక్ బాడీ మోడల్ ను కలిగి ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ 5.
రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ కారు మంచి సామర్థ్యం, చక్కటి ఆచరణాత్మకత. మరింత విశ్వసనీయతతో ఆకట్టుకుంటుంది. ఓల్డేజ్ మారుతి కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి మైలేజీతో అదుర్స్ అనిపిస్తుంది. ప్రస్తుత తరం మోడల్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. మారుతి 1.0 ఐటర్ ఇంజిన్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది CNG కిట్‌తో 34.05 కిమీ మైలేజీని అందిస్తుంది. ఇది సౌకర్యవంతమైన రైడ్, మంచి క్యాబిన్, ఆన్ బోర్డ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ కారు బేస్ మోడల్ ధర రూ. 5.54 లక్షలు కాగా, వ్యాగన్ఆర్ టాప్ ఆఫ్ లైన్ ZXI AT ధర రూ. 7.37 లక్షల వరకు ఉంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. సీటింగ్ సామర్థ్యం 5. బాడీ టైప్ హ్యాచ్ బ్యాక్.
K10 CNG 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది కూడా 34 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. చిన్నది అయినప్పటికీ పవర్ ఫుల్ పెప్పీ ఇంజిన్ సిటీ, హైవే ట్రాఫిక్కి అనుకూలంగా ఉంటుంది. K10 CNG VXI ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. మారుతి ఆల్టో K10 CNGలో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్, మ్యూజిక్ సెటప్ ఉన్నాయి. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండరర్స్, హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు బెస్ట్ మైలేజ్ కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ CNG ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. సీటింగ్ సామర్థ్యం 5 కాగా, బాడీ టైప్ హ్యాచ్ బ్యాక్.
Read Also: టాటా To హ్యుందాయ్.. క్రేజీ మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లు ఇవే!