OTT Movie : డ్రగ్స్, రొమాన్స్ వయాలెన్స్ థీమ్స్ తో ఒక స్పానిష్ ఓటీటీలో రచ్చ చేస్తోంది. ఒక స్పోర్ట్స్ అకాడమిలో జరిగే ఈ కథలో సెక్రెట్ రిలేషన్‌షిప్స్ కూడా ఉంటాయి. డ్రగ్స్ తీసుకుని స్పోర్ట్స్ లో గెలవాలనుకునే వాళ్ళు, అమ్మాయిలతో అఫ్ఫైర్ పెట్టుకునే వాళ్ళే ఎక్కువగా ఈ సెంటర్ లో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ ని ఎంటర్టైన్ చేసే మైండ్ బ్లోయింగ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఒలింపో’ 2025లో వచ్చిన స్పానిష్ టీన్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్. జాన్ మాథ్యూ, లైఫా ఫోగ్వెట్, ఇబాయ్ అబాడ్ దీనిని రూపొందించారు. ఇందులో క్లారా గాల్లే (అమైఆ), నిరా ఓషైఆ (జోయ్), అగస్టిన్ డెల్లా కోర్టే (క్రిస్టియాన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ 2025 జూన్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 8 ఎపిసోడ్స్ ఐయండిబిలో 6.0/10 రేటింగ్ పొందింది.
స్పెయిన్‌లోని ఒక పేరుపొందిన స్పోర్ట్స్ సెంటర్ లో దేశంలోని టాప్ యంగ్ అథ్లెట్స్ ట్రైనింగ్ కోసం వస్తారు. అక్కడ అమై అనే 20 ఏళ్ల అమ్మాయి నేషనల్ ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ టీమ్ కి కెప్టెన్. ఆమె ఫెయిల్యూర్ అనేది అంగీకరించదు. ప్రతి ట్రైనింగ్‌లో పర్ఫెక్ట్ అవ్వాలని ప్రెషర్ తీసుకుంటుంది. ఒక రోజు ట్రైనింగ్ సమయంలో అమైఆ టీమ్ మెంబర్ నూరియా ఒక్కసారిగా కుప్పలు పడి మూర్ఛ పోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లగానే డోపింగ్ వల్ల ఇలా జరిగిందని తెలుస్తుంది. అమైఆ షాక్ అవుతుంది. వీళ్ళకి డ్రగ్స్ ఎవరు ఇచ్చాడు? ఎందుకు? అని ఆమె ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడుతుంది. ఇక్కడి నుంచి మెయిన్ స్టోరీమొదలవుతుంది.
Read Also : కథలు వింటూ సైకో పనులు చేసే మంత్రగత్తె… రాత్రయితే వణికిపోయే అబ్బాయి