Most Watched OTT Shows India: ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ కు రోజురోజుకూ ఆదరణ పెరిగిపోతోంది. సినిమాలు, సిరీస్ లు మాత్రమే కాదు… క్రికెట్ మ్యాచ్‌లు, కామెడీ షోలు, రియాలిటీ ప్రోగ్రాములు, సీరియళ్లు… వాట్ నాట్ ? అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు వ్యూస్ కూడా దంచికొడుతున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా రీసెర్చ్ సంస్థ ఓర్మాక్స్ (Ormax) స్ట్రీమ్‌వ్యూ (Ormax StreamView) పేరుతో ఓటీటీ వ్యూస్ కు సంబంధించిన వీక్లీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో జూలై 13 నుంచి 19 వరకు… గత వారం భారతీయ డిజిటల్ వీక్షకులు ఎక్కువగా చూసింది ఏంటి ? ఏ ప్లాట్‌ఫామ్ ఎక్కువ వ్యూస్ సాధించిందో వెల్లడించారు. మరి ఆ లిస్ట్ పై ఒక లుక్కేద్దాం పదండి.
ఈ వారం టాప్ స్థానంలో నిలిచినది జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ఫిఫా వరల్డ్ కప్ 2026. ఏకంగా 15 మిలియన్లు అంటే 1.5 కోట్లు వ్యూస్ తో ఇది మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమరం భారతీయ డిజిటల్ ప్రేమికులను ఎంతగా ఆకట్టుకుందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. క్రీడా ప్రియులు ఇంట్లో కూర్చుని ప్రపంచ స్థాయి మ్యాచ్‌లను ఆస్వాదించడం ఈ వారం ట్రెండ్‌గా మారింది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడూ ఓటీటీలో హంగామా చేస్తూనే ఉంటారు. జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ప్రసారమైన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ సిరీస్ 2026 ఏకంగా 13.7 మిలియన్ల వ్యూస్ తో ఈ లిస్ట్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత జట్టు ప్రదర్శన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.
ఆటల తర్వాత అత్యధిక ఆదరణ పొందిన డిజిటల్ ప్రోగ్రామ్‌లలో ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2 నిలిచింది. జియోహాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ షో 9.5 మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. టాలెంట్ షోల పట్ల భారతీయుల అభిరుచి ఇంకా తగ్గలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.
సినిమాలు, సిరీస్‌ల విషయానికి వస్తే జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ అదరగొడుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు ఓటీటీ ప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంకా లాఫ్టర్ షెఫ్స్ సీజన్ 3, చాంద్ మేరా దిల్, తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2, అనుపమ వంటి షోలు కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 – ZEE5 – 15 మిలియన్ల వ్యూస్
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ సిరీస్ 2026 -JioHotstar – 13.7 మిలియన్ల వ్యూస్
ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2 – జియో హాట్ స్టార్ – 9.5 మిలియన్ల వ్యూస్
ప్రీతమ్ అండ్ పెడ్రో -జియో హాట్ స్టార్ – 5.3 మిలియన్ల వ్యూస్
లాఫ్టర్ షెఫ్స్ సీజన్ 3 – జియో హాట్ స్టార్ – 5.0 మిలియన్ల వ్యూస్
తారక్ మెహతా కా ఉల్టా చష్మా – జియో హాట్ స్టార్ – 4.9 మిలియన్ల వ్యూస్
చాంద్ మేరా దిల్ – జియో హాట్ స్టార్ – 3.7 మిలియన్ల వ్యూస్
లాక్ అప్ – Netflix – 3.4 మిలియన్ల వ్యూస్
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 -జియో హాట్ స్టార్ – 3.2 మిలియన్ల వ్యూస్
అనుపమ – జియో హాట్ స్టార్ – 3.1 మిలియన్ల వ్యూస్
ఈ వారపు వ్యూస్ లెక్కలను పరిశీలిస్తే… జియోహాట్‌స్టార్ దుమ్మురేపింది. టాప్-10 స్థానాల్లో ఏకంగా ఏడు స్థానాలను జియోహాట్‌స్టార్‌లోని కంటెంట్ దక్కించుకోవడం విశేషం. క్రికెట్, రియాలిటీ కామెడీతో పాటు సీరియల్స్ కూడా వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read Also: ఈ ఊర్లో డైరెక్ట్ గా దేవుడే చంపేస్తాడు భయ్యా… సీన్ సీనుకో ట్విస్ట్ తో సినిమా చూపించే సిరీస్