E-Paper
Advertisement

ఈ ఊర్లో డైరెక్ట్ గా దేవుడే చంపేస్తాడు భయ్యా… సీన్ సీనుకో ట్విస్ట్ తో సినిమా చూపించే సిరీస్

ఈ ఊర్లో డైరెక్ట్ గా దేవుడే చంపేస్తాడు భయ్యా… సీన్ సీనుకో ట్విస్ట్ తో సినిమా చూపించే సిరీస్
Advertisement

Telugu Mystery Thriller Series: గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి, దేవుడిని వరం అడగడం అన్నది ఎంత కామనో మనందరికీ తెలుసు. కానీ ఒక ఊర్లో మాత్రం గుళ్ళో గంట మోగిందో ఎవరో ఒకరికి మూడినట్టే. ఆ చిన్న గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే గంట మోగుతుంది… మరుసటి రోజు ఆ వ్యక్తి శవమై ఓ గుట్టపై పడి ఉంటాడు. మరి అది ఆ ఊర్లో అందరూ అనుకుంటున్నట్టుగా దేవుడి ఉగ్రరూమే అలా శిక్షిస్తోందా ? అనేది తెలియాలంటే కల్ట్ మిస్టరీ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ (Veerabhadruni Rahasyam) చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

‘వీరభద్రపురం’ అనే ఒక మారుమూల మిస్టీరియస్ గ్రామం నేపథ్యం కథ సాగుతుంది. ఆ గ్రామస్తులకు… ఎవరైనా తప్పు లేదా పాపం చేస్తే ఉగ్రరూపంలో ఉండే వీరభద్ర స్వామి స్వయంగా వచ్చి, వారికి దైవశిక్ష విధిస్తాడని నమ్ముతారు. ఊరిలోని పురాతన ఆలయ గంట మోగడం, ఆ వెంటనే పాపం చేసిన వ్యక్తి శవమై ‘గద్దల గుట్ట’పై పడి ఉండటం తరతరాలుగా జరుగుతోంది. గ్రామస్తులు దీనిని దేవుడి శాసనంగా భావించి భయంతో బతుకుతుంటారు.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో నగరానికి చెందిన, ఆధునిక భావాలున్న డాక్టర్ వెన్నెల తన తండ్రి రామస్వామిని వెతుకుతూ వీరభద్రపురంలో అడుగు పెడుతుంది. ఆమె వచ్చిన రోజే ఊరిలో ఒక దారుణమైన హత్య జరుగుతుంది. అందరూ దీనిని దైవశిక్షగా భావిస్తే, సైన్స్ అండ్ లాజిక్‌ను నమ్మే హేతువాది అయిన వెన్నెల మాత్రం ఇది దేవుడు చేసిన పని కాదని, దీని వెనుక ఎవరో మనుషుల కుట్ర ఉందని బలంగా నమ్ముతుంది.

వెన్నెల ఊరిలోని ఆచారాలను ప్రశ్నిస్తూ, చావుల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. దీంతో ఊరి పెద్దల ఆగ్రహానికి గురవుతుంది. మరోవైపు కథ 1972 – 1990ల కాలాల మధ్య సాగుతుంది. యోగానందం కుమారుడైన కార్తికేయ చిన్నతనంలో అడవిలో తప్పిపోవడం, అతనికి వీరభద్రుడు ప్రత్యక్షమై ఒక పవిత్రమైన కత్తిని ఇవ్వడం వంటి గతానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. విచారణ సాగుతున్న కొద్దీ, ‘సెబాస్టియన్’ అనే ఒక ప్రమాదకరమైన బందిపోటు నాయకుడి గతం, భక్తి ముసుగులో ఊరిలో సాగుతున్న నేరాలు, దేవుడి పేరుతో కొందరు చేస్తున్న పనులను హీరోయిన్ కనిపెడుతుంది. మరి ఇంతకీ ఆ ఊర్లో ఏం జరుగుతోంది ? వెన్నెల తన తండ్రిని ఎలా కాపాడుకుంది ? అనేదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.

తెలుగు సిరీసే

Advertisement

భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సరికొత్త తెలుగు ఒరిజినల్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’. ZEE5లో జూలై 2026 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 60 ఎపిసోడ్‌ల భారీ సిరీస్‌గా దీన్ని రూపొందించారు. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లు వస్తున్నాయి. తెలుగు సిరీసే కాబట్టి తెలుగులోనే చూడవచ్చు ఎంచక్కా.

Read Also: అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

Tags

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×