E-Paper
Advertisement

OTT Movie : చనిపోయిన వాళ్ళ ఇళ్లే ఈ ముసలాడి టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే సైకో కిల్లర్ మూవీ

OTT Movie : చనిపోయిన వాళ్ళ ఇళ్లే ఈ ముసలాడి టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే సైకో కిల్లర్ మూవీ
Advertisement

OTT Movie : ఓటిటిలో వచ్చే సినిమాలలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసే ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటారు. అయితే ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీస్ ఓటీటీలో రావడానికి ఎంతో కాలం పట్టడం లేదు. ఓటిటీలో కొన్నిసార్లు థ్రిల్లర్ మూవీస్ ను, వెబ్ సిరీస్ లను డైరెక్ట్ గానే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. థియేటర్లలో రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఆద్యంతం ఆసక్తికరంగా, అనేక మలుపులతో సాగే ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో, కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

Advertisement

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను మనం ఇదివరకు చాలానే చూశాము. అయితే ఈ మూవీలో వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి ఈ మూవీ పేరు ‘అబట్టయిర్ (Abattoir )’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీలోకి వెళ్తే.. 

Advertisement

ఇందులో హీరోయిన్ ఒక దినపత్రికలో పని చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా కూడా పని చేస్తుంది. కానీ ఆమెకు క్రైమ్ రిపోర్టర్ కావాలని ఉంటుంది. అయితే ఓసారి హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. నిజానికి వీరిద్దరూ డేటింగ్ చేసి, ఇదివరకే విడిపోయి ఉంటారు. అయినా ఒక ఇన్వెస్టిగేషన్ పని మీద ఆమెను కలిసేందుకు హీరో మళ్ళీ వస్తాడు. ఆ తరువాత హీరోయిన్ తన ఇంటికి వెళ్తుంది. ఆమె తన అక్క, బావతో కలిసి ఉంటుంది. వారికి ఒక కుమారుడు కూడా ఉంటాడు. ఒకరోజు హఠాత్తుగా తనకి ఫోన్ వస్తుంది. మీ అక్క బావ, వారి పిల్లవాడిని చంపేశాను అని ఒక అపరిచితుడు ఫోన్ చేస్తాడు. ఆమె కంగారుపడి ఇంటికి వెళ్లి చూడగా వాళ్లను దారుణంగా హత్య చేసి ఉంటాడు ఆ సైకో కిల్లర్.

తను చాలా బాధపడుతుంది. వీరి హత్య వెనకాల ఏదో రహస్యం దాగి ఉందనే అనుమానంతో హీరో సహాయం తీసుకొని అందులో దాగి ఉన్న రహస్యాలను కనుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో ఆ ఇంటిని ఒక వ్యక్తి కొనుక్కుంటారు. ఈమె ఇంత త్వరగా ఆ ఇంటిని అమ్మాల్సిన అవసరం ఏముందని, ఆ దిన పత్రికలో యాడ్ ఏజెన్సీని అడుగుతుంది. ధర ఎక్కువ ఇస్తున్నారు అందుకే అమ్మేశా అని సమాధానం చెప్తారు. ఇలాంటి హత్యలు జరిగిన కొన్ని స్థలాలను ఆ ముసలివాడు కొంటూ ఉంటాడు. కొన్న తర్వాత అందులోని వస్తువులను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. చివరకు ఆ హత్యలు చేసిన వ్యక్తి ఎవరు? ఆ ముసలివాడే ఇదంతా చేశాడా? మిగతా హత్యలకు ఆ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా ? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘అబట్టూర్’ (Abattoir) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీలో సన్నివేశాలు ఆసక్తికరంగాను, ట్విస్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమాపై ఓ లుక్కేసేయండి

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×