Nindu Noorella Saavasam Serial Today Episode : అంజును అమ్ము ఓదార్చడంతో ఆరు ఫోటో చేతితో పట్టుకుని అలాగే నిద్రపోతుంది. అకాష్, ఆనంద్ కూడా నిద్రపోతారు. అమ్ము మాత్రం ముగ్గురిని చూస్తుం అలాగే ఉండిపోతుంది. ఇంతలో రూంలోకి మిస్సమ్మ వచ్చి ఆరు ఫోటో ఎక్కడుందని అమ్మును అడిగితే అంజు చేతిలో పట్టుకుని నిద్రపోతుందని ఇప్పుడు ఆ ఫోటో తీసుకోవడానికి ప్రయత్నిస్తే మళ్లీ నిద్ర లేస్తుందని చెప్తుంది. అలాగే అయితే సరే నువ్వు కూడా పడుకో అమ్ము నేను చూసుకుంటాను అంటుంది. అమ్ము పడుకుంటుంది.
మనోహరి, అమర్ దగ్గరకు వెళ్లి పిల్లలకు ఎవరో ఆరు ఫోటో ఇచ్చారు వాళ్లు ఆ ఫోటో చూస్తూ బాధపడుతున్నారు. ఇందాక నేను వాళ్ల రూంలోకి వెళ్లి చూశాను అని చెప్తుంది. దీంతో అమర్ లేచి హాల్ లోకి వెళ్లి అమ్మా నాన్నాలను పిలిచి పిల్లలకు ఎందుకు ఆరు ఫోటో ఇచ్చారని అడుగుతాడు. అంజు బాధపడుతుంటే ఇచ్చామని శివరాం చెప్తాడు. వాళ్లకు ఫోటో ఇస్తే బాధపడతారని తెలుసు కదా నాన్నా.. ఫోటో దగ్గర పెట్టుకుని రాత్రంతా ఏడుస్తారు. హెల్త్ పాడు చేసుకుంటారు. అందుకే ఆరు ఫోటోను నేను వాళ్లకు ఇవ్వలేదు. ఇచ్చే ముందు ఒక్కమాట నాకు చెప్పి ఉండాలి అంటూ అమర్ పిల్లల రూం వైపు వెళ్తాడు.
అంజు చేతిలో ఉన్న ఫోటోనే చూస్తుంది మిస్సమ్మ. ఇంతలో అంజు కొంచెం పక్కకు జరగ్గానే ఫోటో తీసుకుని చూడబోతుంది. ఇంతలో బయట గార్డెన్ లో ఉన్న గుప్త ఉలిక్కిపడి లేచి లోపల మిస్సమ్మ ఫోటో చూసేది తెలుసుకుని… ఇప్పుడు మిస్సమ్మ ఆ ఫోటో చూస్తే బాలికకు ఇప్పుడు ఇచ్చిన ప్రమాదం కన్నా పెద్ద ప్రమాదం వస్తుంది అనుకుని వెంటనే తన మంత్రంతో ఇంట్లో కరెంట్ పోయేలా చేస్తాడు. లోపల కరెంట్ పోవడంతో మిస్సమ్మ ఫోటో చూసినా ఏమీ కనిపించదు. ఇంతలో అమర్ వచ్చి మిస్సమ్మ ను బయటకు లాక్కొస్తాడు. ఆమె చేతిలోని ఆరు ఫోటోను లాక్కుంటాడు.
ఆరు ఏవండి అక్క ఫోటో అంటూ ఏదో చెప్పబోతుంటే పిల్లలకు ఇవ్వొద్దని చెప్పాను కద మిస్సమ్మ.. ఆరు ఫోటో చూస్తే పిల్లలు ఏడుస్తారని తెలుసు కదా? అంటూ సీరియస్ అవుతాడు. దీంతో మిస్సమ్మ అది కాదండి ఒక్కసారి అంటూ మళ్లీ ఏదో చెప్పబోతుంటే ఎందుకు మళ్లీ పిల్లలు ఏడ్వడానికా? చూశావు కదా ఎలా డల్ అయిపోయారో.. ఇంకేం మాట్లాడకు మిస్సమ్మ వెళ్లి పడుకో.. అంటూ ఆరు ఫోటో తీసుకుని వెళ్లిపోతాడు అమర్. ఎందుకు అక్క ఫోటో నేను చూడకుండా ఎప్పుడూ ఇలా అయిపోతుంది. ఎవరో కావాలనే అపుతున్నట్లు అవుతుంది. అనుకుంటూ వెళ్లిపోతుంది మిస్సమ్మ. అంతా గమనిస్తున్న మనోహరి ఊపిరి పీల్చుకుని చూడలేదు అనుకుంటూ తాను వెళ్లిపోతుంది.
ఆరు ఆత్మను వశం చేసుకోవడానికి ఘోర పూజలు చేస్తుంటాడు. సీసాలో బంధీగా ఉన్న ఆరు బాధపడుతుంది. ఘోర నన్ను వదిలేయ్.. నేను వెళ్లి నా పిల్లలను కాపాడుకోవాలి అంటూ వేడుకుంటుంది ఆరు. దీంతో ఘోర కోపంగా నీ పని కాపాడటం కాదు ఆత్మ.. నాశనం చేయడం. ఇకనుంచి దేన్ని కాపాడలేవు. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను నిన్ను ఈ లోక వినాశనానికి వాడతా..? నీ స్థానం ఆ మనోహరికి ఇస్తాను. నీ భర్తకు మనోహరిని భార్యను చేస్తాను అంటాడు.
ఆరు బాధగా వద్దు ఫ్లీజ్.. అది నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. రాక్షసి అది. నీకు దండం పెడతాను ఘోర అంటుంది. ఏం చేస్తాం ఆత్మ నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. కన్నవాళ్లు వదిలేశారు. కట్టుకున్నోడితో నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు నమ్మిన స్నేహం నిన్ను కాటికి పంపింది. ఆ భగవంతుడు నీ మీద జాలి పడి నిన్ను భూలోకంలో ఉంచితే నువ్వు నా కంటపడ్డావు. ఇప్పడు నా లక్ష్యానికి బలి కాబోతున్నావు అంటూ పూజ కంటిన్యూ చేస్తాడు.
గార్డెన్ లో కూర్చుని ఆలోచిస్తున్న మిస్సమ్మకు కరుణ మాటలు గుర్తుకొచ్చి ఎలాగైనా ఆరు అక్క ఫోటో చూడాలి అనుకుని మనోహరి దగ్గరకు వెళ్తుంది. నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని చెప్తుంది మిస్సమ్మ. నీతో నాకు మాటలేంటి..? అయినా నేను బయటకు వెళ్తున్నాను నాకు టైం లేదు అంటూ మనోహరి చెప్పి వెల్లబోతుంటే ఒక్కనిమిషం. నేను మాట్లాడాలి అనుకుంటుంది అమరేంద్ర గారి గురించి ఆరు అక్క గురించి.. నువ్వు ఈ ఇంటికి చెడు చేయాలని చూసి ఉండొచ్చు.
కానీ మనఃస్పూర్తిగా ఆయన మంచి కోరతావని నాకు తెలుసు. అందుకే నీ దగ్గరకు వచ్చాను అని మిస్సమ్మ చెప్పగానే మనోహరి ఆలోచించుకుని సరే దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు అని అడగ్గానే నాకు ఆరు అక్క ఫోటో చూపించు అంటుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో షాక్ నుంచి తేరుకుని వేరే వ్యక్తితో తాను దిగిన ఫోటో చూపిస్తుంది. ఆమెను చూసిన మిస్సమ్మ ఆరు అక్క ఈమేనా అని అడుగుతుంది. అవునని మనోహరి చెప్పగానే అయితే నాకు క్లారీటీ వచ్చింది అనుకుంటూ వెళ్లిపోతుంది.
రామ్మూర్తి స్కూల్ లో సెక్యూరిటీ జాబ్ చేస్తుంటాడు. లంచ్ టైంలో భోజనం చేయడానికి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి ఏంటి తాతయ్యా నువ్వు ఇక్కడున్నావు. పైగా సెక్యూరిటీ డ్రెస్ వేసుకున్నావు. మళ్లీ నువ్వు జాబ్ చేస్తున్నావా? అని అడుగుతారు. పిల్లలకు మాటలకు కంగారు పడిన రామ్మూర్తి అవునని అయితే ఈ విషయం మిస్సమ్మకు, మీ డాడీకి చెప్పొదని అంటాడు. ఎందుకని పిల్లలు అడగ్గానే వాళ్లకు తెలిస్తే నన్ను ఉద్యోగం చేయనివ్వరు అంటాడు రామ్మూర్తి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.