Naga Chaithanya – Sobhitha : టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య గురించి అందరికి తెలిసిందే .. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లు కాపురం చేసిన తర్వాత మనస్పర్థలు రావడంతోనే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక సమంత కెరీర్ పై ఫోకస్ పెట్టింది . కానీ చైతన్య ఇప్పుడు రెండో పెళ్ళికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈయన ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకొని మరో అడుగు ముందుకు వేసాడు . త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి తిరగలేదు .. తాజాగా వీరిద్దరి ఫస్ట్ ఫోటోను నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా అభిమానవులతో పంచుకున్నాడు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఈ పోస్టులో తన కాబోయే భార్య శోభితాతో నాగచైతన్య ఇద్దరూ బ్లాక్ డ్రెస్సులో జంటగా కనిపించారు. గ్రే టీషర్ట్ మీద బ్లాక్ లెదర్ జాకెట్‌లో చైతూ కనిపించగా, శోభిత స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో పాటు భారీ బ్యాగీ జీన్స్‌తో మెరిసింది. వీరిద్దరి లుక్ అల్ట్రా స్టయిలిష్ గా ఉండటంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.. ఎంగేజ్‌మెంట్‌కు ముందు దాదాపు 3 ఏళ్ల నుంచి నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి దిగిన క్రేజీ ఫోటోను చైతూ షేర్ చేశాడు. ఆ తర్వాత ఈ వార్తాలు నిజం అయ్యాయి. ఆగస్టు ౮ న వీరిదద్రూ కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట దుమారం రేపాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరిద్దరి గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు . ఇప్పుడు ఈ ఫోటోను కూడా..
ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరూ కల్కి ఎక్కడా కనిపించలేదు . కేవలం సినిమాల పరంగా మాత్రమే బయట మెరిశారు. ఇది ఫస్ట్ ఫోటో అని ఓ ఫోటోను షేర్ చెయ్యడం అందరిని షాక్ కు గురి చేసింది. ఇక కాబోయే భార్య శోభితతో కలిసి ఉన్న చైతూ ఫొటోలో చాలా స్టైలిష్ గా కనిపించారు. ‘ప్రతీచోటా మొత్తం ఒకేసారి’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు నాగచైతన్య.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోను మీరు ఒకసారి చూసెయ్యండి.. చాలా అందంగా స్టైల్ గా ఉన్నారుగా..
ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ అక్కినేని కుటుంబంకు అడుగడుగునా కష్టాలే .. కోట్లు తెచ్చిపెడుతున్న ఎన్కన్వెన్షన్ కూల్చివేత , సమంత అక్కినేని ఫ్యామిలీ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఇప్పటికి ఈ కేసు కోర్టులో తిరుగుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే .. నాగచైతన్య డిసెంబర్ ౨౦ న తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..