BigTV English
Advertisement

OTT Movie : పెళ్ళయిన సార్ పై మనసుపడే అమ్మాయి… చేయకూడని తప్పు చేసి భర్తను చేజార్చుకునే భార్య

OTT Movie : పెళ్ళయిన సార్ పై మనసుపడే అమ్మాయి… చేయకూడని తప్పు చేసి భర్తను చేజార్చుకునే భార్య

OTT Movie : ఓటిటిలో లవ్ స్టోరీ మూవీస్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది.అందులోనూ స్టూడెంట్ టీచర్ మధ్య జరిగే రొమాన్స్ విభిన్నంగా ఉంటాయి. ఇటువంటి లవ్ స్టోరీలు ఇదివరకే చాలా వచ్చాయి. తెలుగులో ‘సుందరకాండ’ మూవీ అప్పట్లో ఒక సంచలనమే ఇటువంటి మూవీస్ తర్వాత చాలా వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ వైవిధ్యంగా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ట్రయాంగిల్ లవ్ స్టోరీ
టీచర్ స్టూడెంట్ మధ్య జరిగే లవ్, రొమాన్స్ అంటేనే కొత్తగా ఉంటుంది. మరి దీనికి ట్రయాంగిల్ కాన్సెప్ట్ యాడ్ అయితే ఎలా ఉంటుంది? ఇందులోని స్టోరీ ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా ఉంటుంది. కానీ ఆ ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయ్యాక స్టోరీ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? వినడానికే కొత్తగా ఉన్న ఈ స్టోరీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసింద. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘బాసంత ఈసె గీచే’ (Basanta Ese Geche). ఇది ఒక బెంగాలీ మూవీ.ఈ సినిమాలో లవ్ స్టోరీ మనసుకి హత్తుకునేలా అద్భుతంగా ఉంటుంది.

కథలోకి వెళితే..
నిషాన్ అనే వ్యక్తి ఒక స్కూల్లో టీచర్ గా ఉంటాడు.అతను చూడటానికి చాలా అందంగా ఉండడంతో ఆ స్కూల్లో అమ్మాయిలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందులో టియాస అనే అమ్మాయి ఆయనను ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి రోజు ఆ టీచర్ ని ఫాలో అవుతూ ఉంటుంది. కానీ మరోవైపు టియాసని అభిషేక్ అనే ఒక వ్యక్తి ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం అతన్ని పట్టించుకోదు. టీచర్ మీదే ఎక్కువగా ప్రేమ పెంచుకుంటుంది. ట్విస్ట్ ఏంటంటే టీచర్ కి ఇదివరకే పెళ్లి అయి ఉంటుంది. కానీ ఆ విషయం స్కూల్లో ఎవరికీ తెలియదు. అలాగే టియాసాకి కూడా తెలియదు ఒకరోజు టియాస ఒక లవ్ లెటర్ ని రాసి టీచర్ కి తెలియకుండా బైక్ లో పెడుతుంది. అది తీసుకొని టీచర్ తన భార్యకి ఆ లవ్ లెటర్ చూపిస్తాడు. నాకు ఎవరో లవ్ లెటర్ రాశారు అని చెప్తాడు. అయితే ఆ విషయాన్నివాళ్లు సరదాగా తీసుకుంటారు. టీచర్ భార్య మాత్రం తన భర్తకు పరీక్ష పెడుతుంది. టియాస ఫోన్ నెంబర్ తీసుకొని తన భర్తకి తెలియకుండా, తన ఫోన్లో నుంచి మెసేజ్ పెడుతుంది. తర్వాత టీచర్ కి తెలిసి తప్పని వారిస్తాడు. అయినా గాని టీచర్ భార్య తన భర్త తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఒకవైపు టియాస టీచర్ ని గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది. ఒకానొక టైంలో టియాస, టీచర్ ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు. ఈ విషయం టీచర్ భార్యకి తెలుస్తుంది. మరోవైపు టియాస తల్లి అప్పుల ఊబిలో కూరుకు పోతుంది. విడాకులు తీసుకున్న ఆమె భర్త ఒకరోజు అనుకోకుండా తనని కలుస్తాడు. ఆ అప్పు నేను తీరుస్తాను అని చెప్తాడు. చివరికి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు. ఇదిలా ఉంటే టీచర్ భార్య అనారోగ్యంతో మంచాన పడుతుంది. మరోపక్క టియాసకి టీచర్ కి పెళ్లి అయిన విషయం తెలిసి బాధపడుతూ ఉంటుంది. చివరికి టీచర్ లవ్ స్టోరీ ఫలిస్తుందా ? వీరి లవ్ స్టోరీ తెలిసి టీచర్ భార్య ఏం చేస్తుంది? టియాస తల్లికి తన మాజీ భర్త సాయం చేస్తాడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే అడ్డా టైమ్స్ (Adda Times) ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ బెంగాలీ మూవీని తప్పక చూడాల్సిందే.


Related News

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

OTT Movie : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా

OTT Movie : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా

OTT Movie : టెంపుల్‌లో కోనేరు మిస్టరీ… ఆ వాటర్ తాగితే పరలోకానికే… కనిపెట్టిన డాక్టర్‌కు బుర్రబద్దలయ్యే షాక్

OTT Movie : ఫారెస్ట్ రేంజర్ పదవిని పోగొట్టుకుని ఆర్మీ కోసం పాకులాట.. ఆటలోకి దిగాక ఫ్యూజులు ఔటయ్యే షాక్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

Big Stories

×