BigTV English

OTT Movie : ఆస్తి కోసం ముసలావిడతో లవ్ డ్రామా… ఈ ఇద్దరు దేశముదుర్ల సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు అంటే?

OTT Movie : ఆస్తి కోసం ముసలావిడతో లవ్ డ్రామా… ఈ ఇద్దరు దేశముదుర్ల సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు అంటే?

OTT Movie : ఓటిటిలో చాలా క్యాటగిరీ మూవీస్ లు వస్తూ ఉంటాయి. అందులోనూ లవ్ స్టోరీలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే మనం చెప్పుకోబోయే ఈ మూవీలో హీరో హీరోయిన్లు యుక్త వయసు వారు కాదు వీరు ముసలివారు. హీరో హీరోయిన్లు లేకుండా ఇద్దరు ముసలి వాళ్ళతో ఈ మూవీని డైరెక్ట్ చేశారు మేకర్స్. ఇందులోని చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉంటాయి. ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా సాధించింది. మరి ఈ మూవీ పేరేమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేద్దాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ లో ఇద్దరు ముసలి జంటల మధ్య కథ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు మరేమిటో కాదు ‘ద గుడ్ లయర్’ (The Good Liar). ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయే ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


కథ విషయానికి వస్తే.. 

ముసలివాడైన రాయ్, ప్రెట్టి అనే బామ్మతో ఒక డేటింగ్ యాప్ లో పరిచయమై, ఆమెకు స్నేహంతో దగ్గరవుతాడు. వారు ఒక హోటల్లో కలసి ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. బామ్మ ముసలివాడితో నాకు ఒక కొడుకు ఉన్నాడు అని చెప్తుంది. రాయ్ నాకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. కానీ అతనికి నేను దూరంగా ఒంటరిగా ఉన్నాను అని అబద్దం చెప్తాడు. అయితే బామ్మ మీరు ఒంటరిగా ఉండడం ఎందుకు మాతో ఉండొచ్చుగా అని వారి ఇంటికి తీసుకు వెళుతుంది. ఈ విషయం బామ్మ వాళ్ళ అబ్బాయికి నచ్చదు. ఇదిలా ఉంటే రాయ్ ఇల్లీగల్ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అదే బాటలో బామ్మని కూడా మోసం చేయాలని చూస్తాడు.

బామ్మకి మిలియన్ డాలర్ల ఆస్తి ఉందని గ్రహిస్తాడు. ఎలా కొట్టేయాలి అని ఆలోచనలో పడతాడు. అతనికి విన్సెంట్ అనే సహచరుడు ఉంటాడు. ఆస్తిని కొట్టేయడానికి అతని సాయం అడుగుతాడు రాయ్. వీరిద్దరూ కలిసి బామ్మను మీ ఆస్తి ఎంత ఉంటుందని అడుగుతారు. ఆమె రెండు మిలియన్ల పైగానే ఉంటుందని చెప్పగానే వీరికి ఇంకా ఆశ పుడుతుంది. ఆ డబ్బును షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. అందుకు ఆ బామ్మ ఒప్పుకోదు. బామ్మ ని నమ్మించడానికి ఆ ముసలివాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. తనతో ప్రేమను పంచుతున్నట్లు, తను లేకుండా నేను బతకలేను అన్నట్లు నటిస్తాడు.

ఎందుకంటే ఇదివరకే ఆ ముసలివాడు చాలా మందిని మోసం చేసి ఉంటాడు. చివరికి ఆ బామ్మ ఇతని మాటలకు పడిపోయి డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుని ఆ డబ్బుని జాయింట్ ఖాతాలో జమ చేస్తుంది. ఆ తర్వాత ఆ ముసలివాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ బ్యాంకును ఆపరేట్ చేసే ఒక వస్తువుని బామ్మ ఇంట్లోనే మర్చిపోతాడు. ఆ తర్వాత బ్యాంకు వాళ్ళని నా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఆ వస్తువు లేకుండా వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం కుదరదని చెప్తారు. ముసలివాడు తిరిగి ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ బామ్మని కలసిన ముసలోడికి ఒక ట్విస్ట్ ఎదురౌతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? చివరికి ఆ బామ్మని ఇతడు మోసం చేయగలిగాడా? బామ్మ ఇతనిని మోసం చేసిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ద గుడ్ లయర్‘ (The Good Liar) మూవీని చూడాల్సిందే

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×