BigTV English

OTT Movie : పడక గదిలో భర్త టార్చర్, రాత్రేయితే చాలు వణికిపోయే భార్య… వణికించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పడక గదిలో భర్త టార్చర్, రాత్రేయితే చాలు వణికిపోయే భార్య… వణికించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లో మలయాళ సినిమాల హవా ఇప్పుడు బాగా నడుస్తోంది. మలయాళం మూవీస్ చాలావరకు చిన్న సినిమాలే అయినా విజయాలు మాత్రం పెద్దగానే ఉంటున్నాయి. రొమాంటిక్ మూవీస్ ఎక్కువగా మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినవే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాలీవుడ్ లో ఒక మంచి మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది?అనే విషయాలు తెలుసుకుందాం పదండి.


ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ ఒక శాడిస్ట్ భర్త చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు “ఓట్టమూరి వెలిచమ్” (Ottamuri Velicham). చిన్న సినిమానే అయినా కథాంశంతో ప్రేక్షకుల మదిలో మంచి మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.

చంద్రన్ అనే వ్యక్తి ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఒక చిన్న ఎలక్ట్రిషియన్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి చదువుకున్న పట్టణ ప్రాంతానికి చెందిన సుధా అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. చంద్రన్ కు తల్లితోపాటు ఒక తమ్ముడు కూడా ఉంటాడు. వీరు చాలా బీదరికంలో ఉంటారు. వారి ఇంటికి వచ్చిన సుధా ఆ ఇంటిని చూసి ఇలాంటి ఇంట్లో నేను ఎలా ఉండగలను అని ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉంటే మొదటి రాత్రి ఆమె తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను ఊహించిన మొదటి రాత్రి ఇది కాదని బాధపడుతుంది.


ఆ ఇంట్లో లైట్ కూడా ఆఫ్ చేయడానికి ఉండదు. ఆ లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆమె భర్త అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం తాగి ఇంటికి వస్తాడు. ఆమె దగ్గరకి భర్త రావడంతో సుధా అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. భర్తతో ఈ విషయం చెప్పి కొంచెం దూరంగా పడుకుంటుంది. చంద్రన్ కి కోపం వస్తుంది. ఈ ఇంట్లో తలుపు లైట్లు సరిచేయాలని అత్తతో చెప్తుంది. ఇదే విషయాన్ని ఆమె చంద్రంతో చెప్పడంతో అప్పుడే ఎదురు చెబుతుందా అని ఆమెను కొట్టడం ప్రారంభిస్తాడు.

ఆమె మీద అనుమానంతో రోజూ కొడుతూ టార్చర్ చేస్తుంటాడు. ఆ టార్చర్ ను తట్టుకోలేక ఆమె ఒకసారి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అతని తమ్ముడి ద్వారా ఆ విషయం తెలుసుకుని చంద్రన్ మళ్లీ ఆమెను ఇంటికి తీసుకువస్తాడు. ఆ తర్వాత సుధ భర్తని చంపడానికి పథకం వేస్తుంది. తన భర్తను చంపితేనే ఈ నరకం నుంచి బయట పడగలను అని భావిస్తుంది. భర్త నిద్రిస్తుండగా ఒకరోజు గ్యాస్ లీక్ చేసి అందులో అగ్గిపుల్ల వేసే ప్రయత్నం చేయగా, ఇంతలోనే ఆమె స్నేహితుడు అక్కడికి రావడంతో ఆ ప్రయత్నం విరమించుకుంటుంది సుధ.

ఒకరోజు ఇద్దరూ బయటికి వెళ్తుండగా ఒక వాగులో భర్త పడిపోతాడు. అప్పుడు కాపాడమని తన భార్యని అడుగుతాడు చంద్రన్ . ఆ శాడిస్ట్ భర్తను సుధ కాపాడిందా? తన అత్తగారి ఇంటి నరకం నుంచి బయట పడగలిగిందా? అనే ఆసక్తికరమైన విషయాలను మీరు చూడాలనుకుంటే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ మూవీ ‘ఓట్టమూరి వెలిచమ్ ‘ (Ottamuri Velicham)ను తప్పకుండా చూడాల్సిందే

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×