BigTV English
Advertisement

OTT Movie : ప్రియుడి వల్ల ఆ పాడు అలవాటుకు అడిక్ట్… అమ్మాయిలు కచ్చితంగా చూడాల్సిన మూవీ

OTT Movie : ప్రియుడి వల్ల ఆ పాడు అలవాటుకు అడిక్ట్… అమ్మాయిలు కచ్చితంగా చూడాల్సిన మూవీ

OTT Movie : ప్రేమ అంటేనే మత్తు… ప్రేమ గుడ్డిది అనే మాటలని ఇప్పటి వరకు విన్నాం మనం. ప్రేమ మత్తులో మునిగితే ప్రపంచం డిఫరెంట్ గా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు ప్రేమికులు. ఈ సినిమాని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమించిన వాడి మాయలో పడి ప్రపంచాన్ని మరిచిపోయే అమ్మాయిలు లెక్కలేనంత మంది ఉంటారు. ఇక అదే అదునుగా తీసుకొని, ప్రేమ పేరుతో అమ్మాయిలను ప్రమాదాల్లో పడేసే అబ్బాయిల సంఖ్య కూడా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కాస్త ఆదమరిస్తే చాలు జీవితం డేంజర్ లో పడిపోతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఈ మూవీని అమ్మాయిలు మిస్ అవ్వకుండా చూడాలి. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ప్లిక్స్ లో అందుబాటులో…

సినిమాల్లో డ్రగ్స్ వాడకం అనేది కొన్నిసార్లు డిస్టర్బ్ గా ఉంటుంది. కొన్ని సినిమాల్లో చూస్తే వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టినట్టుగా చూపించారే అని ఆలోచన రేకెత్తుతుంది. ముఖ్యంగా కొన్ని సినిమాలను చూసి యూత్ ఎలా చెడిపోతుంది, వాళ్లను ఎలాంటి పరిస్థితులు పెడదోవ పట్టిస్తున్నాయి అనే విషయాలు తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీలో కూడా ఒకరు తీసుకునే నిర్ణయాలు మరొకరి జీవితాన్ని ఎలా బలి తీసుకుంటాయి? యూత్ ఎలా చెడిపోతుంది ?అనే విషయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు డైరెక్టర్. సినిమా మొత్తం సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ నేపథ్యంలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో బో*ల్డ్ సీన్స్ తో పాటు డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి సింగిల్ గా చూస్తే బెటర్.


కథలోకి వెళ్తే…

హీరోయిన్ లండన్ వీధుల్లో డ్రగ్స్ కోసం వెతుకుతూ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఆమెకు కావాల్సింది తెచ్చిస్తాడు. టైం కి తన అవసరం తీర్చిన ఆ వ్యక్తితో హీరోయిన్ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటూ మరోవైపు డ్రగ్స్ తీసుకుంటూ సంతోషంగా బ్రతికేస్తారు. ఇక హీరోయిన్ అతను తన జీవితంలోకి వచ్చాక ప్రపంచం అందంగా మారిపోయిందని ఫీల్ అవుతుంది. అంతేకాకుండా అందమైన సీతాకోక చిలుకలాగా రంగుల ప్రపంచంలో హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవుతుంది. కానీ అసలు విషయం ఏమిటంటే హీరోయిన్ అతని వల్లే తన జీవితాన్ని కోల్పోతున్నట్టు తెలుసుకొలేక పోతుంది. అతనేమో హీరోయిన్ ని పూర్తిగా మాదకద్రవ్యాల మత్తులో ముంచి తనకేం కావాలో హీరోయిన్ తో చేయిస్తాడు. అలాగే ప్రేమిస్తున్నట్టుగా ఆమెతో సన్నిహితంగా ఉంటాడు. చివరికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో హీరోయిన్ మత్తు దిగుతుంది. కానీ అలవాటును మాత్రం మాన లేక పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. అసలు హీరోయిన్ ఆ అలవాటును మానడానికి ఏం చేసింది? తన తప్పును తెలుసుకున్న హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే విషయం తెలియాలంటే ‘వైట్ గర్ల్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే.

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×