BigTV English
Advertisement

Aditya Om: మణికంఠ అసలు నువ్వు మనిషివేనా? ఆదిత్య ఓం ఆగ్రహం.. అదేంటి ఆమెను అంత మాట అనేశాడు?

Aditya Om: మణికంఠ అసలు నువ్వు మనిషివేనా? ఆదిత్య ఓం ఆగ్రహం.. అదేంటి ఆమెను అంత మాట అనేశాడు?

Bigg Boss Aditya Om: బిగ్ బాస్ సీజన్ 8లో అయిదో వారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వచ్చేశాడు. కానీ ఇది ఎవరూ ఊహించని ఒక ఎలిమినేషన్. మామూలుగా ప్రతీ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో ప్రకటిస్తారు. ఈసారి అలా జరగలేదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో ఎవరూ ఊహించని విధంగా ఆదిత్య ఓంను బయటికి పంపించేశారు హౌస్‌మేట్స్. డేంజర్ జోన్‌లో నైనికా, విష్ణుప్రియా, ఆదిత్య ఓం ఉండగా.. మెజారిటీ హౌస్‌మేట్స్ నిర్ణయం ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చివరిసారిగా హౌస్‌మేట్స్‌ను కలవడానికి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌లో కూడా పాల్గొన్నాడు.


వారందరికీ హగ్స్

అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాడు కాబట్టి ఆదిత్య ఓం.. మళ్లీ తమను కలవడానికి వస్తాడని హౌస్‌మేట్స్ ఊహించలేదు. కానీ సడెన్‌గా నాగార్జునతో పాటు స్టేజ్‌పై కనిపించి అందరికీ షాకిచ్చాడు. హౌస్‌మేట్స్‌లో ఎవరికి హగ్ ఇవ్వాలి, ఎవరికి పంచ్ ఇవ్వాలి అంటూ ఆదిత్యతో చివరి టాస్క్ ఆడించారు నాగ్. హగ్ కేటగిరిలో నబీల్, పృథ్వి, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియాను పెట్టాడు ఆదిత్య. నబీల్ గెలిస్తే తాను గెలిచినట్టే ఫీలవుతానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. నిఖిల్‌ను చూస్తే 30 ఏళ్ల క్రితం తనను తాను చూసుకున్నట్టు ఉందని అన్నాడు. పృథ్వి ఆట ఇప్పుడు తనకు చాలా నచ్చిందని ప్రశంసించాడు. యష్మీ, మణికంఠ, నైనికా, సీతను పంచ్ కేటగిరిలో పెట్టి ఒక్కొక్కరికీ ఒక్కొక్క సలహా ఇచ్చాడు.


Also Read: హౌస్ లో సీక్రెట్ ఎఫైర్స్ పై సోనియా బాంబ్.. ఇంత పచ్చిగా చెప్పేసిందేంటి? 

కావాలనే గొడవలు

బిగ్ బాస్ బజ్‌లో ఆదిత్య ఓం ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలయ్యింది. అందులో అర్జున్.. తన ఎంత రెచ్చగొట్టినా ప్రశాంతంగానే సమాధానాలిచ్చాడు. హౌస్‌లో జర్నీ గురించి చెప్పమనగా.. ‘‘అది పెద్ద సైకాలజీ, మెంటల్ టెస్ట్’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఆదిత్య. ‘‘హౌస్‌లో చాలామంది కావాలనే గొడవలు పెట్టుకుంటున్నారు. వాళ్లు అదే కంటెంట్ అని ఫీలవుతున్నారు. నబీల్ మెగా చీఫ్ అయిన తర్వాత అనవసరంగా యష్మీ.. ప్రేరణను చాలా తిట్టింది’’ అంటూ హౌస్‌లోని కొన్ని సంఘటలను గుర్తుచేసుకున్నారు. చీఫ్ అవ్వాలని లేదంటూ తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటున్నట్టుగా తెలిపాడు. ‘‘నేను ఆడడం ప్రారంభించగానే ఎలిమినేట్ అయ్యాను’’ అని ఫీలయ్యాడు ఆదిత్య.

కొంచెమైనా బుర్ర ఉందా?

నాలుగు వారాల్లో ఎంతమంది చీఫ్స్ మారారో.. ఆదిత్య ఓం కూడా అన్ని టీమ్స్ మారాడు. దానిపై బజ్‌లో స్పందించాడు. ‘‘ఎన్ని టీమ్స్ మారినా మా చీఫ్స్‌కు కూడా నేను ఆడినట్టు అనిపించలేదు. సీత చీఫ్‌గా నన్ను వెన్నుపోటు పొడించిందని కూడా చెప్పొచ్చు’’ అన్నాడు. ఒకవేళ తను చీఫ్ అయితే తన టీమ్‌లో నబీల్, పృథ్విరాజ్, సీత ఉంటారని చెప్పాడు. సీత గురించి నెగిటివ్‌గా మాట్లాడినా కూడా తనే హౌస్‌కు ప్రాణం అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. చివరిగా ‘‘మణికంఠ.. నువ్వు అసలు మనిషివా? జంతువువా? ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి నీకు కరెక్ట్ సలహా ఇచ్చాను. కానీ ప్రతీసారి నేను ఇచ్చిన సలహాను నువ్వు సరిగ్గా తీసుకోలేదు. ఎప్పుడు నేర్చుకుంటావు? కొంచెమైనా బుర్ర ఉందా?’’ అంటూ మణికంఠపై కోపమంతా బయటపెట్టేశాడు ఆదిత్య ఓం.

Related News

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Bigg Boss 9 Telugu Day 59 : దెయ్యాల వేట – రీతూ ఆట… హౌస్ మేట్స్ కన్నింగ్ ప్లాన్ కు డెమోన్ బలి… గౌరవ్ పై నోరు పారేసుకున్న దివ్య

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Big Stories

×