Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా వచ్చిన నాగ మణికంఠ.. చాలామంది ప్రేక్షకులకు మాత్రమే కాదు.. హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌కు కూడా తెలియదు. అందుకే తను ఎవరో తెలియకుండానే తనను కాస్త దూరం పెట్టారు. మొదటి నామినేషన్స్ సమయానికే అసలు తనేంటో, తన జీవితం ఏంటో పూర్తిగా ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు. దీంతో చాలామందికి తనపై జాలి కలిగింది. ఎమోషన్స్‌ను పక్కన పెట్టి గేమ్‌పై ఫోకస్ చేయమని మొదటి వీకెండ్‌లో చెప్పిన మాటను సీరియస్‌గా తీసుకున్న మణికంఠ.. కొన్నిరోజులు బాగానే ఆడాడు. కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదటికి రావడంతో నాగార్జున సీరియస్ అవ్వక తప్పలేదు.
టార్గెట్ చేశారు
గతవారం ఇకపై చీఫ్ అనేవాడు హౌస్‌కు ఒక్కరే ఉండాలని బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో చీఫ్ కంటెండర్ అవ్వడం కోసం పోటీ మొదలయ్యింది. అందులో మొదట్లోనే మణికంఠను రేసు నుండి తప్పించింది యష్మీ. ఆ విషయాన్ని మణి తట్టుకోలేకపోయాడు. హౌస్‌మేట్స్ అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని మాట్లాడడం మొదలుపెట్టాడు. అది ఎవ్వరికీ నచ్చలేదు. ముఖ్యంగా ఈ విషయంపై మణికంఠతో వాగ్వాదానికి దిగింది సీత. తనకు మాత్రమే కాదు.. మణికంఠ వదిలిన మాటలు అక్కడ ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో నాగార్జున రాగానే ఈ టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభమవ్వగానే మణిని యాక్షన్ రూమ్‌లోకి పిలిచారు నాగ్.
Also Read: హౌస్ లో సీక్రెట్ ఎఫైర్స్ పై సోనియా బాంబ్.. ఇంత పచ్చిగా చెప్పేసిందేంటి?
ఏడవాలనుకుంటే ఏడువు
తనకు 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నానని కావాల్సినంత ఏడ్చేయమని ఆఫర్ ఇచ్చారు నాగార్జున. కానీ తనకు అలా ఏడుపు రాదని అన్నాడు మణి. అయితే శుక్రవారం ఎపిసోడ్‌లో తనకు ఫుడ్ వచ్చింది ప్రియా దగ్గర నుండి కాదని, తన ఫ్రెండ్ దగ్గర నుండి అని క్లారిటీ ఇచ్చారు నాగ్. దీన్ని బట్టి తనకు ఏం అర్థమయ్యింది అని నాగార్జున అడగగా.. ‘‘ప్రియా ఇంక నా దగ్గరికి రాదు’’ అని ఏడ్చేశాడు మణి. అదే సమయంలో ప్రియా తనకు ఒక లెటర్ పంపిందని రివీల్ చేశారు. అంతే కాకుండా ఇకపై తను ఎప్పుడూ ఏడవకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ యాక్షన్ రూమ్ నుండి బయటికి రాగానే మణికంఠను ఏడిపించడానికి హౌస్‌మేట్స్ అంతా సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా ప్రవర్తించారు.
ఏడుపే స్ట్రాటజీ
చీఫ్ కంటెండర్ టాస్కులో మణికంఠ.. హౌస్ మొత్తాన్ని కలిపి అనడం ఎవ్వరికీ నచ్చలేదు. అందుకే తను ఫ్రెండ్స్ అనుకునే నబీల్, విష్ణుప్రియా సైతం మణిదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు. తను స్వార్థపరుడు, కన్నింగ్, ఇబ్బందిపెడతాడు అంటూ తనకు ట్యాగ్స్ ఇచ్చారు. అందుకే ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా సరదాగా ఉన్నా మణికంఠ మాత్రం కనీసం నవ్వలేదు. తను కూడా వేరేవాళ్లకు ట్యాగ్స్ ఇవ్వమని అడిగినప్పుడు కూడా తను దానికి అర్హుడు కాదని అన్నాడు. దీంతో నాగార్జునకు కోపం వచ్చి ఏడుపును స్ట్రాటజీగా వాడొద్దు అంటూ మణికంఠకు మరీ మరీ చెప్పారు. ఆదిత్య ఓం కూడా ప్రేక్షకులు తనను చాలా అభిమానిస్తున్నారని, గట్టిగా ఆడి నిరూపించుకోవాలని మణికి మోటివేషన్ ఇచ్చాడు.