E-Paper
Advertisement

OTT Movie : ఏం సినిమా గురూ… చేతబడితో చెమటలు పట్టించే హర్రర్ మూవీ… కల్లోనూ కలవరపెట్టే రియల్ స్టోరీ

OTT Movie : ఏం సినిమా గురూ… చేతబడితో చెమటలు పట్టించే హర్రర్ మూవీ… కల్లోనూ కలవరపెట్టే రియల్ స్టోరీ
Advertisement

OTT Movie : ఇల్లు రెంటుకు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది ఈ రోజుల్లో కామన్. కానీ ఆ ఇల్లు రెంట్ కి ఇచ్చాక గుండె గుభేల్మనిపించే ట్విస్ట్ లు ఎదురైతే జన్మలో రెంట్ అనే పదాన్నే వినకూడదు అనుకుంటాము. ఇలాంటి స్టోరీ లైన్ తో తెరకెక్కిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. హర్రర్ మూవీ లవర్స్ ఖచ్చితంగా ఇప్పటి దాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు. ఇంతకీ ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

అత్యంత భయంకరమైన ఈ హర్రర్ మూవీ పేరు ‘హోమ్ ఫర్ రెంట్’ (Home for Rent). 2023లో విడుదలైన థాయ్ ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కు డైరెక్టర్ సోఫోన్ సక్దాఫిసిట్ దర్శకత్వం వహించారు. రియల్ లైఫ్ ఈవెంట్స్ నుండి ఇన్‌స్పైర్ అయిన ఈ మూవీ థాయ్‌లాండ్‌లో బాక్సాఫీస్ హిట్ అయ్యి, అంతర్జాతీయంగా Netflixలో పాపులర్ అయింది. 2 గంటల 4 నిమిషాలు ఉన్న ఈ మూవీ IMDbలో రేటింగ్ 6.6 రేటింగ్ పొందింది. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, బ్లాక్ మ్యాజిక్, డార్క్ కల్ట్ రిచ్యువల్స్ వంటి అంశాలు మెండుగా ఉంటాయి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : సైకోల చేతికి చిక్కే ఒంటరి అమ్మాయి… ఒక్కో సీన్ అరాచకం… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

కథలోకి వెళ్తే…

నింగ్ – క్విన్ దంపతులు తమ చిన్న కూతురు ఇంగ్‌తో హ్యాపీగా లైఫ్ ను స్పెండ్ చేస్తారు. ఆర్థిక సమస్యల వల్ల తమ పెద్ద ఇల్లు రెంట్‌కు ఇచ్చి, కాండో అనే ప్రాంతానికి మారతారు. కొత్త టెనెంట్స్ అయిన రత్రీ, ఆమె కూతురు నుచ్ చూడడానికి చాలా మంచివారిలా కనిపిస్తారు. కానీ క్రమంగా ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. నింగ్‌కు టెనెంట్స్ ఏదో డార్క్ సీక్రెట్ దాస్తున్నారని అనుమానం వస్తుంది. ఆమె భర్త క్విన్ బిహేవియర్ మారిపోతుంది. కూతురు ఇంగ్ ప్రమాదంలో పడుతుంది. క్విన్‌కు ముందు భార్యతో ఒక కూతురు జా ఉండేది. కార్ యాక్సిడెంట్‌లో అతని మొదటి భార్య, కూతురు జా చనిపోయారు. ఆ తరువాత నింగ్ ను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఇక్కడికి వచ్చాక కూతురు ఇంగ్… క్వీన్ మొదటి భార్యకు పుట్టిన కూతురు జాలా బిహేవ్ చేయడంతో షాక్ అవుతుంది నింగ్. ఆ తరువాత నెమ్మదిగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతాయి. నింగ్ ట్రూత్ తెలుసుకుని రత్రీని అటాక్ చేసి చంపేస్తుంది. ఫైట్‌లో క్విన్ కూడా చనిపోతాడు. అసలు ఆ ట్విస్టులు ఏంటి? నింగ్ ఎందుకు భర్తనే చంపేసింది? ఆమె కూతురికి ఏమైంది? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. థాయ్ హారర్ లవర్స్‌కి బెస్ట్ ఛాయిస్ ఈ మూవీ.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×