E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : నోరు తెరిస్తే బ్యాడ్ అవుతారేమోనని… కళ్యాణ్ గురించేనా… అర్థరాత్రి ఇదేం పని డెమోన్ ?

Bigg Boss 9 Telugu : నోరు తెరిస్తే బ్యాడ్ అవుతారేమోనని… కళ్యాణ్ గురించేనా… అర్థరాత్రి ఇదేం పని డెమోన్ ?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు డెమోన్ పవన్. పేరుకు తగ్గట్టే అన్నీ గేమ్స్ లోనూ దుమ్మురేపి, డెమోన్ అంటేనే ఇతర కంటెస్టెంట్స్ వణికేలా చేశాడు. కానీ రీతూ విషయమే ఇతనికి కాస్త మైనస్ అయ్యింది. అందుకేనేమో ఆమె వెళ్లిపోయాక ఒరిజినల్ డెమోన్ బయట పడ్డాడు. తాజాగా బిగ్ బాస్ తో అర్దరాత్రి ముచ్చట్లు పెడుతూ కన్పించాడు డెమోన్.

ఆ ఒక్కటే రిగ్రెట్ 

డే 100 ఎపిసోడ్ లో డెమోన్ ప్రభంజనం కన్పించింది. 4 టాస్క్ లు పెడితే రెండు టాస్క్ లలో ఆడి గెలిచాడు. ఓ టాస్క్ లో సంచాలక్, మరో టాస్క్ లో ఆడే ఛాన్స్ లేక పక్కనుండిపోయాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరు?’ అని బిగ్ బాస్ ప్రశ్నించారు. హౌస్ మేట్స్ అందరూ కలిసి డిసైడ్ చేయాలని చెప్పగా… మిగతా నలుగురు కంటెస్టెంట్స్ ఏక కంఠంతో డెమోన్ ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా డెమోన్ కు తన అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ పంపారు. అది చూసి డెమోన్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్ళు పెట్టుకోగా, హౌస్ లో అన్న బాండ్ ఉన్న ఇమ్మూ డెమోన్ ను ఓదార్చాడు. ఆ తరువాత “నాకు బిగ్ బాస్ వదిలి వెళ్లాలని లేదు. ఇన్నాళ్లూ హౌస్ లో సిగ్గు, మొహమాటంతో సాఫ్టు గా, ఆకతాయిగా, సరదాగా గడిపేశాను. ఎవరైనా ఏమైనా అన్నా కూడా నేను గట్టిగా మాట్లాడలేదు. అలా మాట్లాడితే వాళ్ళు బ్యాడ్ అయిపోతారేమో అని ఆగిపోయాను. నా వల్ల ఇంకొకరు బ్యాడ్ గా పోట్రే అవుతారేమో అని నాకు భయం. మాట్లాడి ఉండే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకునే వారో. కానీ అదొక్కటే ఉండి పోయింది. బిగ్ బాస్ నీవల్ల, ఈ అవకాశం వల్ల మా అమ్మానాన్నలు ఈరోజు ప్రౌడ్ గా ఉన్నారు” అంటూ కృతజ్ఞతను వ్యక్తం చేశాడు డెమోన్.

కళ్యాణ్ పైనేనా ఆ కామెంట్స్?

Advertisement

అయితే ఇన్నాళ్ళూ హౌస్ లో రీతూ చుట్టూనే తిరుగుతూ కన్పించాడు డెమోన్. గొడవలు, అలకలు, ఆటలు, సపోర్ట్, వంటలు, ఫ్లర్టింగ్ అన్నీ ఆమెతోనే చేశాడు. కానీ రీతూ వెళ్లిపోయాక ఫ్రీబర్డ్ అయ్యాడు. నాగార్జున సైతం వీకెండ్ ఎపిసోడ్ లో రీతూ వెళ్లిపోయాక, ఇన్నాళ్ళకు ఒరిజినల్ డెమోన్ బయట పడ్డాడు అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. నిజంగానే డెమోన్ గత వారం నుంచి జోక్స్ వేస్తూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ కన్పిస్తున్నాడు. పైగా అతనికి మంచి స్క్రీన్ స్పేస్ దక్కుతోంది. మరి ఇలాంటి గట్టిగా అంటే అవతలి వాళ్ళు బ్యాడ్ అయిపోతారేమో అంటూ డెమోన్ అన్నది ఎవరిని? అనే చర్చ మొదలైంది. ఇదంతా కళ్యాణ్ గురించే అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే హౌస్ లో కళ్యాణ్ కు పడనిది కేవలం కళ్యాణ్ పడాలతోనే. అతనే డెమోన్ పై బ్యాక్ స్తాబర్ అనే ముద్ర కూడా వేశాడు. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాడు.

Read Also : తనూజ ప్లేయర్ ఆఫ్ ద డే… డెమోన్ పై బిగ్ బాస్ సెటైర్లు… ఇమ్మూ – కళ్యాణ్ కు వార్నింగ్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×