E-Paper
Advertisement

OTT Movie : సైకోల చేతికి చిక్కే ఒంటరి అమ్మాయి… ఒక్కో సీన్ అరాచకం… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

OTT Movie : సైకోల చేతికి చిక్కే ఒంటరి అమ్మాయి… ఒక్కో సీన్ అరాచకం… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్
Advertisement

OTT Movie : కొన్ని లోబడ్జెట్ సినిమాలు స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్‌తో ఆకట్టుకుంటాయి. రియలిస్టిక్ థీమ్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. సర్వైవల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా క్లైమాక్స్ వరకు కుర్చీల్లో కూర్చోబెడుతోంది. ఈ చిత్రం ఒక యంగ్ వుమన్ అడవుల్లో దారితప్పి క్రిమినల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి పోరాడే స్టోరీ. ఈ సినిమా కేవలం హారర్ మాత్రమే కాదు, ఒక అమ్మాయి తన ధైర్యం, తెలివితేటలతో మనుషుల రూపంలో ఉన్న మృగాల నుండి తనని ఎలా రక్షించుకుందనేది ఆసక్తికరంగా చూపిస్తుంది. సస్పెన్స్, ట్విస్టులతో ఈ మూవీ ఆడియన్స్ చేత కేక పెట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రస్ట్ క్రీక్’. 2018లో వచ్చిన ఈ సినిమా, దర్శకురాలు జెన్ మెక్‌గోవన్ డైరెక్షన్‌లో రూపొందింది. ఇందులో హెర్మయోనీ కార్ఫీల్డ్ లీడ్ రోల్‌లో నటించింది. Hulu, Shudder, netflixలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : రాత్రంతా రామ నామాన్ని జపించేలా చేసే 1 గంట 40 నిమిషాల హర్రర్ మూవీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

స్టోరీ ఏమిటంటే

సాయర్ అనే ఒక కాలేజీ విద్యార్థిని, వాషింగ్టన్ డి.సి.లో ఒక ముఖ్యమైన జాబ్ ఇంటర్వ్యూ కోసం కారులో ఒంటరిగా వెళ్తుంటుంది. దారి మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో, సమయం ఆదా చేయడానికి గూగుల్ మ్యాప్స్ చూపించిన షార్ట్‌కట్ దారిని ఎంచుకుంటుంది. కానీ ఆ మ్యాప్ ఆమెను అడవుల్లోకి తీసుకెళ్లి దారి తప్పేలా చేస్తుంది. అడవిలో దారి వెతుకుతున్న సాయర్‌కు ఇద్దరు సోదరులు కనిపిస్తారు. ఆమెకు సహాయం చేసే నెపంతో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో సాయర్ కాలికి తీవ్రమైన గాయమవుతుంది. గాయంతోనే ఆమె అడవిలోకి పారిపోతుంది.

Advertisement

విపరీతమైన చలి, ఆకలి, గాయంతో పోరాడుతున్న సాయర్‌ను లోవెల్ అనే వ్యక్తి కాపాడతాడు. లోవెల్ ఆ అడవిలోనే ఒక పాత వ్యాన్‌లో ఉంటూ డ్రగ్స్ తయారు చేస్తుంటాడు. అతను కూడా సాయర్‌ను వెంటాడుతున్న ఆ ఇద్దరు సోదరులకు బంధువే. కానీ లోవెల్ ఆమెను చంపకుండా, ఆమె గాయానికి చికిత్స చేసి రక్షిస్తాడు. అసలు విషయం ఏమిటంటే, ఆ ఇద్దరు సోదరుల వెనుక ఆ ప్రాంతపు పోలీస్ అధికారికి కూడా ఉంటాడు. అక్కడ జరిగే అక్రమ వ్యాపారాలన్నీ పోలీస్ కి తెలుసు. సాయర్ ప్రాణాలతో ఉంటే తమ గుట్టు రట్టవుతుందని వారు ఆమెను చంపాలని చూస్తారు. సాయర్, లోవెల్ కలిసి వారిని ఎలా ఎదుర్కొన్నారు? చివరకు సాయర్ ఆ ప్రమాదకరమైన అడవి నుండి ప్రాణాలతో బయటపడిందా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

 

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×