E-Paper
Advertisement

OTT Movie : 50 లక్షల బడ్జెట్ 100 కోట్ల కలెక్షన్స్… దిక్కుతోచని స్థితిలో బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్

OTT Movie : 50 లక్షల బడ్జెట్ 100 కోట్ల కలెక్షన్స్… దిక్కుతోచని స్థితిలో బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్
Advertisement

OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక నిర్మాతలకు కొన్ని నష్టాలు ఎదురైతే, మరికొన్ని లాభాలు చేకూరాయి. ముఖ్యంగా మూవీ రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేయగలిగితే భారీ స్థాయిలో ఓటీటీ డీల్ కుదురుతుంది. దానివల్ల నిర్మాతలు రిలీజ్ కి ముందుగానే మంచి లాభాలను కళ్లజూస్తున్నారు. అయితే ఈ క్రేజీ డీల్ ఎక్కువగా కుదిరేది తెలుగు, హిందీ, తమిళ సినిమాలకే. మిగతా భాషలలో వచ్చే సినిమాలను పెద్దగా పట్టించుకోవు ఓటీటీలు. దానివల్ల ఇతర భాషలల్లోనే కాదు తెలుగులో సైతం కొన్ని చిన్న సినిమాలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా ఓ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

బ్లాక్ బస్టర్ సినిమాకు దొరకని ఓటీటీ

గుజరాతీ చిత్రం ‘లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే’ (Laalo – Shree Krishna Sada Sahaayate)రీసెంట్ గా రిలీజ్ అయ్యి, బాక్స్ ఆఫీసు వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కగా, రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపరిచింది. BookMyShowలో ఈ చిత్రం దాదాపు 2 నెలల పాటు ట్రెండ్‌ లో ఉండడం మరో విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా దాదాపు 1.6 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన భక్తి నాటక చిత్రం ‘లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే’లో రీవా రచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి, మిష్టి కడేచా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మానిఫెస్ట్ ఫిల్మ్స్ అండ్ జే వ్యాస్ ప్రొడక్షన్స్ పై అజయ్ బల్వంత్ పదరియా, మానసి పరేఖ్, పార్థ్వీ గోహిల్ నిర్మించారు. స్మిత్ జే స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం బిగ్ స్క్రీన్‌లలోకి వచ్చి రెండు నెలలకు పైగా అయ్యింది. కానీ ప్రస్తుతానికి దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదా స్ట్రీమింగ్ తేదీ గురించి స్పష్టత లేదు. నిజానికి చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన 45 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కానీ ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

Advertisement

Read Also :  ఏం సినిమా గురూ… చేతబడితో చెమటలు పట్టించే హర్రర్ మూవీ… కల్లోనూ కలవరపెట్టే రియల్ స్టోరీ

కథలోకి వెళ్తే…

‘లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే’ స్లీపర్ హిట్ గురించి తెలుసుకున్న ప్రేక్షకులు, మూవీ ఓటీటీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ అయిన స్టార్టింగ్ లో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ తరువాత అద్భుతమైన మౌత్ టాక్ తో, ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన గుజరాతీ చిత్రంగా అవతరించింది. ఇక ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని మూవీ లవర్స్ అనుకుంటున్నారు. కథ విషయానికొస్తే… ఒక రిక్షా డ్రైవర్ చుట్టూ సాగుతుంది కథ. అతను ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుని, తన వెంటాడే గతాన్ని ఎదుర్కొంటాడు. శ్రీకృష్ణుని దర్శనాలు అతనికి విముక్తి కలిగించి, సద్మార్గంలో నడిపిస్తాయి.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×