E-Paper
Advertisement

OTT Movie: అమ్మాయిలను చంపి ఆ కోరిక తీర్చుకునే సైకో… భయంతో చెమటలు పట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: అమ్మాయిలను చంపి ఆ కోరిక తీర్చుకునే సైకో… భయంతో చెమటలు పట్టించే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు చూడడానికి ఎంగేజింగ్ గా ఉంటాయి. అయితే అదే టైంలో కరెక్ట్ గా స్టోరీ ఉంటే వెన్నులో వణుకు పుడుతుంది. సీను సీనుకో ట్విస్టుతో థ్రిల్లింగ్ గా అనిపించే ఈ సినిమాలకు ఓటిటిలో మంచి డిమాండ్ ఉంది. ఇక ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే. పైగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రను పోషించింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

డైరెక్ట్  గా ఓటిటి రిలీజ్

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో డైరెక్ట్ గా ఓటీటీలో వచ్చేసింది. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ అంధురాలు. అయినప్పటికీ ఆ సైకో కిల్లర్ విషయంలో ఆమె చూపించే చాకచక్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సస్పెన్స్, ఎమోషనల్ అంశాలను కలగలిపి ఈ సినిమాను తీశారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. మిళింద్ రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, అమీర్ అజ్మల్ విలన్ గా నటించారు. ఒక్కో సీనుకు సినిమాపై క్యూరియాసిటీ పెరగడంతో పాటు క్లైమాక్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.

స్టోరీ ఏంటంటే….

Advertisement

ఇందులో హీరోయిన్ పేరు దుర్గ. సిబిఐ ఆఫీసర్ అయిన ఈ హీరోయిన్ ఓ ప్రమాదంలో కంటి చూపును కోల్పోతుంది. అదే ప్రమాదంలో తన తమ్ముడిని కూడా కోల్పోతుంది. అయినప్పటికీ గుండె నిబ్బరం చేసుకొని బ్రతుకుతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు నగరంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతున్నారనే వార్తలు వినిపిస్తాయి. అంధురాలు అయిన హీరోయిన్ ఓ రోజు రాత్రి బస్టాప్ లో క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ టైంలోనే సైకో టాక్సీ డ్రైవర్ అని చెప్పి హీరోయిన్ ని ఎక్కించుకొని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ ప్రయాణంలో ఆ సైకో డ్రైవ్ చేస్తున్న కారు యాక్సిడెంట్ కు గురవుతుంది. దీంతో అసలే సిబిఐ ఆఫీసర్ అయిన హీరోయిన్ అనుమానాస్పదంగా అనిపించడంతో అక్కడి నుంచి దిగి పారిపోతుంది. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. కానీ ఒక గుడ్డి అమ్మాయి చూడకుండానే ఏదో ప్రమాదం జరిగిందని ఎలా చెప్తుంది అనే డౌట్ తో ఎస్సై కేసును పట్టించుకోడు. కానీ ఆమె సిబిఐ ఆఫీసర్ కావడంతో ఏదో ఫార్మాలిటీ కోసం కేసును విచారించడం మొదలుపెడతాడు. దీంతో ఈ కేసులో షాకింగ్ విషయాలన్నీ బయటకు వస్తాయి. అసలు ఆ టాక్సీ డ్రైవర్ ఎవరు? ఎందుకు హీరోయిన్ ని కిడ్నాప్ చేయాలనుకున్నాడు? ఈ టాక్సీ డ్రైవర్ కు ఊర్లో మిస్ అవుతున్న అమ్మాయిలకు సంబంధం ఏంటి? చివరికి ఈ కేసును దుర్గా, ఎస్సై ఇద్దరు కలిసి ఎలా సాల్వ్ చేశారు? నిందితుడు దొరికాడా లేదా? అనే విషయాలు తెలియాలంటే నేత్రికన్ అనే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×