E-Paper
Advertisement

Devara Second Day Collections : ‘ దేవర ‘ ఊచకోత.. రెండో రోజు అదే జోరు.. ఎన్ని కోట్లంటే?

Devara Second Day Collections : ‘ దేవర ‘ ఊచకోత.. రెండో రోజు అదే జోరు.. ఎన్ని కోట్లంటే?
Advertisement

Devara Second Day Collections :  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవర ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ విన్నా ఇదే మాటలు.. ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ళ తర్వాత వచ్చిన సోలో మూవీ కావడంతో ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఫ్యాన్స్ అంచాలను రీచ్ అయ్యేలా సినిమాను తెరకెక్కించారు కొరటాల శివ.. అతనికి ఆచార్య ఫ్లాప్ తర్వాత ఈ మూవీ భారీ విజయాన్ని అందుకొని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. మొదటి షోతోనే బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చేసింది. కోట్లు కొల్ల గొట్టేస్తుంది.. మొదటి రోజు రూ. 172 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు తగ్గలేదు. అన్ని ఏరియాల్లో కలిపి బాగానే వసూల్ చేసిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఎన్ని కోట్లో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు.. ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఉండటం వల్ల సినిమాకు నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది. దేవర బిజినెస్ కూడా అన్ని రాష్ట్రాల్లో బాగానే జరిగింది. దాంతో ఈ మూవీకి కాసుల వర్షం కురిస్తుంది. మొదటి రోజు ఏకంగా రూ. 172 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు తగ్గలేదు..

Advertisement

ఈ సినిమాకు వీకెండ్ బాగా కలిసి వచ్చింది. రెండో రోజు వసూళ్ల సునామీ తగ్గలేదు. అదే జోరుతో బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1900 షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల షేర్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్‌గా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్సుగా నమోదు చేసింది. దేవర సినిమాకు ఇండియా మొత్తం కలిపి రూ. 30 కోట్లు రాబట్టిందని టాక్. మొత్తంగా వరల్డ్ వైడ్ కలిపి రూ. 30 కోట్ల వరకు రాబట్టిందని సమాచారం.. ఈ విధంగా చూసుకుంటే రూ. రెండో రోజు రూ. 200 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ నమోదు చేసుకుంది. ఈ రిజల్ట్ పై దేవర టీమ్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.. మూడో రోజు ఇంకాస్త ఎక్కువ టిక్కెట్స్ బుక్ అయ్యినట్లు సమాచారం. ఇక దేవర సూపర్ హిట్, ఆ తర్వాత వార్ 2 మరి కొద్దిరోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇది అయ్యాక ప్రశాంత్ నీల్ తో కొత్త మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాల పై కూడా ఎన్టీఆర్ ఆశలు పెట్టుకున్నారు. ఇక హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ రేంజ్ ఇంకాస్త పెరుగుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×