E-Paper
Advertisement

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!
Advertisement

Astrology 29 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఒత్తిడికి లోనుకావొద్దు. అవసరానికి ధనం అందుతుంది. గురు శ్లోకాలు పఠిస్తే మేలు.

Advertisement

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృథా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శివారాధన శుభప్రదం.

మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు వరిస్తాయి. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

Advertisement

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ఆదాయం నిరాశజకంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా మంచిది. శనిధ్యానశ్లోకం చదవాలి.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసంతో తిరుగులేని విజయాలు. గర్వం దరిచేరనీయవద్దు. సమయానికి నిద్ర అవసరం. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన మంచిది.

Also Read: 3 రాశుల జీవితంలో సూర్య, కేతు ప్రభావం.. ఇక అన్నీ అద్భుతాలే

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది.ఉద్యోగులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉండవచ్చు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదేవతారాధన శుభకరం.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కనకధారాస్తోత్రం చదవడంతో శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో సవాళ్లను ఎదుర్కొని విజయం సాధిస్తారు. కీలక బాధ్యతలు అప్పగిస్తారు. అనవసర వివాదాలకు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. శని శ్లోకం చదవండి.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నష్టాలు రావొచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. నవగ్రహ ధ్యానంతో శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభం:
కుంభ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. బంధువుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢంగా ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ధన వ్యయం పెరుగుతుంది. పెద్దల సలహాలతో నడుచుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఉద్యోగులు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×