E-Paper
Advertisement

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న 2 గంటల 28 నిమిషాల పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్… IMDbలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న 2 గంటల 28 నిమిషాల పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్… IMDbలో అదిరిపోయే రేటింగ్
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే అదరగొడతాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన ఓ సినిమా కూడా ఇదే దారిలో నడుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. కానీ ఓటీటీలలో మాత్రం దూసుకెళ్లి దుమ్మురేపుతోంది. పైగా ట్రెండింగ్ లో ఉన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ను కూడా పక్కకు నెట్టేసింది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా రెండు వారాల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగు పెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రెండింగ్‌లో రెండవ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు కొత్త ఎంట్రీ ఇచ్చిన ‘కాంత’ ఆ మూవీని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కాంత’ డిసెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడతో సహా పలు భాషలలో విడుదల అయ్యింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లో ఉన్న అన్ని సినిమాలను అధిగమించి నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

Advertisement

Read Also : తండ్రి దుర్మార్గం అన్న అరాచకం… అందమైన అమ్మాయికి నరకం… మస్త్ షేడ్స్ ఉన్న స్టోరీ

కథలోకి వెళ్తే…

థియేటర్లలో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం దుమ్మురేపడం విశేషం. ఈ చిత్రం 1950లలో మద్రాసులో ఒక ప్రముఖ దర్శకుడు, అతని సూపర్ స్టార్ శిష్యుడి మధ్య జరిగిన తీవ్రమైన అహంకార ఘర్షణ గురించిన పీరియాడిక్ థ్రిల్లర్. సినిమా సెట్‌లో జరిగిన హత్య మిస్టరీ నేపథ్యంలో సెట్ చేసిన కథ. తమిళ సినిమా మొదటి సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం నుండి ఈ సినిమా ప్రేరణ పొందిందని అంటారు. ఈ చిత్రానికి IMDbలో 7.9 రేటింగ్ ఉంది.

Advertisement

ఈ సినిమాలో దర్శకుడు అయ్య (పి. సముద్రఖని), ఒకప్పుడు అయ్య కింద పనిచేసిన సూపర్ స్టార్ టి.కె. మహాదేవన్ (దుల్కర్ సల్మాన్) కథ. వారిద్దరికీ ఒకప్పుడు తండ్రి-కొడుకుల సంబంధం ఉండేది. కానీ అయ్య డ్రీం ప్రాజెక్ట్ టికెతో వివాదానికి మూలంగా మారుతుంది. ఇప్పుడు సూపర్ స్టార్ అయిన టికె, సినిమాను తన ఇష్టానుసారం మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇది అయ్యకు కోపం తెప్పిస్తుంది. ఈ చిత్రంలో కుమారిని ప్రధాన పాత్రలో ఎంపిక చేస్తారు. కానీ ఆమె టికె పట్ల ఆకర్షితురాలవుతుంది. టికె అప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ, ఆమెతో డేటింగ్ స్టార్ట్ చేస్తాడు. తరువాత కుమారి అయ్యతో ఏం మాట్లాడుతుందో వినడానికి టికె సీక్రెట్ గా ఒక పరికరాన్ని అమర్చుతాడు. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అపార్థం చేసుకుంటాడు. ఈ క్రమంలోనే కుమారి హత్య జరుగుతుంది. ఈ మిస్టరీని పరిష్కరించడానికి రానా దగ్గుబాటి పోలీసు అధికారిగా రంగంలోకి దిగుతాడు. మరి కుమారిని ఎవరు చంపారు? టికె అనుమానం నిజమేనా ? అనేది తెరపై చూడాల్సిందే.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×