E-Paper
Advertisement

OTT Movie: పని మనిషితో రాసలీలలు… అమ్మాయిని దోచుకోవడానికి పిక్ పాకెట్ గాడి పిచ్చెక్కించే ప్లాన్… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie: పని మనిషితో రాసలీలలు… అమ్మాయిని దోచుకోవడానికి పిక్ పాకెట్ గాడి పిచ్చెక్కించే ప్లాన్… సీను సీనుకో ట్విస్ట్
Advertisement

OTT Movie: పని మనిషిగా వచ్చి ఆ పని కాకుండా వేరే పనులు చేసే స్టోరీలైన్ తో ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఆ జానర్ లోనే ఇదొక మాస్టర్ పీస్. హీస్ట్ జానర్ కు ఎరోటిక్ ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు రూపొందించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మరి ఈ మూవీ కథేంటి? ఏ ఓటీటీలో ఉంది? బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికి కూడా ఎందుకింత పాపులర్ అయ్యింది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2016లో విడుదలైన సౌత్ కొరియన్ ఎరోటిక్ హిస్టారికల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ది హ్యాండ్‌మెయిడెన్’ (the handmaiden). పార్క్ చాన్-వూక్ (Park Chan-wook) దర్శకత్వం వహించిన ఈ మూవీ రచయిత సారా వాటర్స్ రాసిన 2002 బ్రిటిష్ నవల “Fingersmith” ఆధారంగా తెరకెక్కింది. కానీ ప్లాట్ ను కొరియా ఆడియన్స్ కు అనుగుణంగా మార్చారు. ఫిల్మ్‌లో కిమ్ మిన్-హీ, కిమ్ టే-రి, హా జంగ్-వూ, చో జిన్-వూంగ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఏకంగా 2016 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్మ్ డి’ఓర్ కోసం సెలెక్ట్ అయింది. 2016 జూన్ 1న సౌత్ కొరియాలో విడుదలైన ఈ మూవీ డైరెక్షన్, రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజికల్ స్కోర్, నటుల పెర్ఫార్మెన్స్‌లకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 38 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ చేసింది. పార్క్ చాన్-వూక్ కెరీర్ లో ‘ఓల్డ్‌బాయ్’ (2003) తర్వాత ఇదే బెస్ట్ ఫిల్మ్‌. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

సూకీ (కిమ్ టే-రి) అనే యువ కొరియన్ పిక్‌పాకెట్, దొంగల గ్రూప్‌లో పెరిగి పెదదయ్యింది. “కౌంట్ ఫుజివారా” (హా జంగ్-వూ) అనే కాన్ మ్యాన్ ఆమెను ఒక గొప్ప ఇంటి పని మనిషిగా రిక్రూట్ చేస్తాడు. ధనవంతురాలు జపనీస్ హైరెస్ లేడీ హిడెకో (కిమ్ మిన్-హీ)ను మోసం చేసి, ఆమెను పిచ్చిదానిగా చూపించి మెంటల్ ఆసుపత్రికి పంపాలి. ఆ తరువాత, ఆమె సంపద (1.5 మిలియన్ యెన్ క్యాష్, 300,000 యెన్ బాండ్స్) దోచుకోవాలి అన్నది కాన్ మ్యాన్ ప్లాన్. సూకీకి ఈ ప్లాన్ ను సక్సెస్ చేస్తే 100,000 యెన్, హిడెకో డ్రెస్‌లు, జ్యువెలరీ ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. సూకీ “తమకో” అలియాస్‌ హిడెకో మేడ్‌గా ఎంటర్ అవుతుంది. హిడెకో ఒంటరిగా, కోపంగా ఉంటుంది. ఆమె అంకుల్ కౌజుకి (చో జిన్-వూంగ్) ఆమెను ఎమోషనల్‌గా వేధిస్తాడు. రేర్ బుక్స్ కలెక్ట్ చేయడమే పనిగా పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సూకీ హిడెకోను సాంగ్ పాడి కంఫర్ట్ చేస్తుంది.

Read Also : దేవుడి గుడిలో వింత శాపం… అంతుచిక్కని చావులు… దడ పుట్టించే థాయ్ హారర్ మూవీ

 అంతేకాదు సక్సెస్ ఫుల్ గా ఆమెను కౌంట్‌తో లవ్‌ లో పడేలా చేస్తుంది. కానీ సూకీ, హిడెకో మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. “కౌంట్‌ను మెప్పించడం చేయడం ఎలా” అని చేసి చూపించే క్రమంలో ఇద్దరమ్మాయిలు దగ్గరవుతారు. ఇక హిడెకో అంకుల్ గోల్డ్ మైన్‌కు వెళ్లగానే… ముగ్గురూ కలిసి జంప్ అవుతారు. హిడెకో – కౌంట్ అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది? హిడెకోను వాళ్ళిద్దరూ మోసం చేశారా? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అన్నది స్టోరీ.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×