E-Paper
Advertisement

OTT Movie : మొగుడు దూరంగా ఉన్నాడని ఫ్రెండ్ తో ఎఫైర్… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదుర్స్ మావా

OTT Movie : మొగుడు దూరంగా ఉన్నాడని ఫ్రెండ్ తో ఎఫైర్… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదుర్స్ మావా
Advertisement

OTT Movie : ఓటీటీలో ఎన్నో  సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే మనసును కదిలించేలా ఉంటాయి. ఇటీవల కాలంలో ఎఫైర్ అనే మాట సర్వ సాధారణం అన్నట్టుగా మారిపోయింది. కానీ దానివల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచించకుండానే చాలామంది అలాంటి పనులకు సిద్ధం అవుతున్నారు. ఈ రోజు మనం చెప్పుకోబోయే మూవీని చూస్తే ఎఫైర్ అనే పదం విన్నా వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే?

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఒక మలయాళ మూవీ గురించి. మంజుమ్మెల్ బాయ్స్ మూవీ తరువాత మలయాళ సినిమా అంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఉంటాయి అని అన్పిస్తోంది. అయితే అందులో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఉంటాయి, పైగా ఎంగేజింగ్ గా, ఆద్యంతం ఆసక్తికరమైన ట్విస్ట్ లతో సాగుతాయి. మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్, దుర్గా కృష్ణ, ఇంద్రన్స్ ప్రధాన పాత్రలను పోషించారు.  ఈ మలయాళ చిత్రం పేరు ‘ఉడల్’. 2022 మే 20న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ‘ఉడల్’ చిత్రం ఈ ఏడాదే జనవరి 5 న సైనా ప్లాట్‌ఫామ్ ద్వారా ఓటీటీలోకి వచ్చి చేరింది. రతీష్ రఘునందన్ ‘ఉడల్’ చిత్రానికి దర్శకత్వం వహించగా, గోకులం మూవీస్ కోసం శ్రీ గోకులం గోపాలన్ నిర్మించారు.

మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి కారణం ఇదే 

Advertisement

‘ఉడల్’ మూవీ దాదాపు రెండేళ్ల తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డానికి కారణంగా ఏంటంటే ఈ సినిమా హిందీ రీమేక్ గురించి చర్చలు జరిగాయి. హిందీలో కూడా ఒరిజినల్ మూవీని రూపొందించిన డైరెక్టర్ ఈ సినిమాను తీయబోతున్నారని సమాచారం.

కథలోకి వెళ్తే.. 

ఈ చిత్రం షైనీ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది, ఆమె తన మామగారైన కుట్టిచాయన్‌తో పాటు మంచాన పడి ఉన్న అత్తగారిని చూసుకుంటుంది. ఆమె భర్త ఉద్యోగం టౌన్ కి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఇంటికి భర్త దూరంగా ఉండటంతో కిరణ్ అనే అబ్బాయి షైనీకి తోడుగా ఉంటాడు. భర్త లేకపోవడంతో పాటు అనారోగ్యంతో ఉన్న అత్తగారిని చూసుకోవడంలో విసుగ్గా ఆమె రోజులు గడిపేస్తుంటుంది. ఇక ఆమెకున్న ఒకే ఒక్క ఓదార్పు తన పాత కాలేజీ మేట్ కిరణ్‌. భర్త లేని సమయంలో తనకు అండగా నిలిచిన అతనితో నెమ్మదిగా హీరోయిన్ అనుబంధం మొదలవుతుంది. పైగా ఆలోచన లేని, సున్నితత్వం లేని తన భర్త కంటే అతనే బెటర్ అన్పిస్తాడు. పైగా తన భర్త ఆమె గురించి అస్సలు పట్టించుకోడు. అయితే హీరోయిన్ మామ మాత్రం గుడ్డివాడు, వృద్ధుడు. అయినప్పటికీ అతను తన భార్యను శ్రద్ధగా చూసుకుంటాడు. మరోవైపు ఫ్రెండ్ తో హీరోయిన్ ఎఫైర్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుంది. దీంతో తమకు అడ్డుగా ఉన్న అత్తా మామలను చంపాలని ప్లాన్ చేస్తారు. ఆ విషయం మామకు తెలుస్తుంది. మరి ఆ ముసలాడు వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనేది  తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×