BigTV English
Advertisement

Pooja Hegde : సైలెంట్ గా ఆ పని కానిచ్చేసిన పూజా హెగ్డే?

Pooja Hegde : సైలెంట్ గా ఆ పని కానిచ్చేసిన పూజా హెగ్డే?

Pooja Hegde :  టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఇప్పుడు ఏదో ఒకటో, రెండో సినిమాల్లో నటిస్తూ వస్తుంది గత రెండేళ్లుగా ఈమెకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అప్పటిలో తెలుగులో స్టార్ సినిమా అంటే చాలు ఫస్ట్ పూజా హెగ్దే దగ్గరకు వెళ్లాకే ఆ నెక్స్ట్ వేరే హీరోయిన్ దగ్గరకు వెళ్లే పరిస్థితి కనిపించింది.. కానీ ఈ మధ్య వరుస ఫ్లాప్ సినిమాలు ఈమె అకౌంట్ లో ఉండటంతో ఈమె దగ్గరకు అస్సలు సినిమాలు రావడమే తగ్గాయి. మహేష్ గుంటూరు కారంలో కొంత పార్ట్ షూట్ లో పాల్గొన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది అమ్మడు. అప్పటి నుంచి పూజా హెగ్దే ఖాతాలో ఒక్క తెలుగు సినిమా పడలేదు. ఇక తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..


ఇకపోతే ప్రస్తుతం తమిళ్ సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ప్రస్తుతం తమిళ్ లో సూర్య హీరోగా చేస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య 44వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. కార్తీ వింటేజ్ లుక్ తో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ మధ్య ఈ షూటింగ్ మొదలైంది. ఇక తన పోర్షన్ పాత్రను సైలెంట్ గా కానిచ్చేశారు. ఇంత సైలెంట్ గా షూటింగ్ అయిపోవడం ఏంటని ఆడియన్స్ ఆశ్చర్యపడుతున్నారు. పూజా హెగ్దే పోర్షన్ అంతా పూర్తి చేసి ఆమెకు చిత్ర యూనిట్ గుడ్ బై చెప్పేశారట..

తమిల్లో ఈ అమ్మడు విజయ్ తో బీస్ట్ సినిమా చేశారు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పటివరకు కొత్త సినిమా ఆఫర్ ఆమె రాలేదు. మళ్లీ సూర్య 44 లో అవకాశం దక్కించుకుంది. సూర్య 44 సినిమా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా సూర్య ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కు నచ్చేస్తుందని అంటున్నారు.. తమిళ్లో తెరకెక్కుతున్న ఈ మూవీని, తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్ లో సినిమా రాబోతుందని సమాచారం. కనీసం ఈ సినిమా అయిన పూజా రాతను మార్చేలా హిట్ అవుతుందేమో చూడాలి. ఇక తెలుగులో మాత్రం పూజా హెగ్డేకు ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తుంది. సూర్య సినిమా హిట్ అయితే ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ మూవీ పూజా పాపకు లైఫ్ అండ్ డెత్ సమస్య అనే చెప్పాలి. ఇక చేతితో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. అక్కడ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×