E-Paper
Advertisement

OTT Offer : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్… కేవలం రూ.175కే 10 ఓటీటీల సబ్స్క్రిప్షన్

OTT Offer : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్… కేవలం రూ.175కే 10 ఓటీటీల సబ్స్క్రిప్షన్
Advertisement

OTT Offer : దేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో, కస్టమర్లకు కాలింగ్ నుండి డేటా వరకు వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది. ఇక వినియోగదారులు ఒకే ప్లాన్‌లో వివిధ రకాల ఓటీటీ సేవలను కూడా ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు Jio వినియోగదారులు అతి తక్కువ ధరలకే కొన్ని ఓటీటీ సేవలను యాక్సెస్ చేయవచ్చు. మరి ఆ ప్లాన్ ల వివరాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.

175 డేటా ప్లాన్ ?

28 రోజుల డేటాతో ఈ జియో 175 ప్రీపెయిడ్ ప్లాన్ పొందవచ్చు. ఇందులో 10GB హై-స్పీడ్ డేటా, JioTV యాప్ ద్వారా 12 ప్రీమియం ఓటీటీ అప్లికేషన్‌లకు యాక్సెస్ ఉంటాయి. యాడ్ ఆన్ ప్యాక్‌గా ఈ ప్లాన్ ఉంటుంది. దీనికి అపరిమిత వాయిస్ కాలింగ్ పొందడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌లో చేర్చబడిన ఓటీటీ యాప్‌లలో సోనీ లివ్, జీ5, జియో టీవీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ఎన్‌ఎక్స్‌టి, కాంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్ ఉన్నాయి.

జియో 445 ప్రీపెయిడ్ ప్లాన్

Advertisement

జియో రూ.445 ప్రీపెయిడ్ ప్లాన్, రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 100 SMSలతో 28 రోజులు యాక్టివ్ లో ఉంటుంది. ఇందులో సోనీ లివ్, జీ5, జియో టీవీతో సహా 10 కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. జియోటీవీ ద్వారా అపరిమిత 5G డేటా కూడా ఇందులో ఉంది. ఇది డేటా ప్లాన్, జియో స్పెషల్ ఆఫర్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో సోనీ లివ్, జీ5, జియో టీవీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ఎన్‌ఎక్స్‌టి, కాంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫన్‌కోడ్, హోయిచోయ్‌లకు యాక్సెస్ ఉంటుంది. ఇది 18 నెలల పాటు గూగుల్ ప్రో ప్లాన్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

జియో 500 ప్లాన్

జియో రూ.500 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, కస్టమర్‌లు రోజుకు 2GB అపరిమిత 5G డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 100 SMSలను పొందుతారు. ఇందులో కస్టమర్‌లు YouTube ప్రీమియం, జియో హాట్‌స్టార్ (టీవీ/మొబైల్), ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, సోనీ లివ్, జీ5, జియో టీవీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ఎన్‌ఎక్స్‌టి, కాంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫన్‌కోడ్ హోయిచోయ్‌ల ఓటీటీ లకు యాక్సెస్ ను పొందుతారు. ఈ ప్లాన్ జియో క్లౌడ్‌కు రెండు నెలల ఉచిత ట్రయల్‌ను కూడా అందిస్తుంది.

Advertisement

Read Also : 2000 ఎత్తున్న టవర్ పై ఇద్దరే అమ్మాయిలు… ఒక్కో టర్న్ కి గుండె జారిపోద్ది… నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ కే పోతారు భయ్యా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×