E-Paper
Advertisement

BB Jodi season 2 Promo : రీతూ vs సత్య ఫైట్.. షో నుంచి రీతూ అవుట్.. షోలో రచ్చ రచ్చ..

BB Jodi season 2 Promo : రీతూ vs సత్య ఫైట్.. షో నుంచి రీతూ అవుట్.. షోలో రచ్చ రచ్చ..

BB Jodi season 2 Promo : గతేడాది డిసెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తి అయింది.. కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల కప్పు గెలుచుకోవడం తోపాటుగా 50 లక్షల ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాడు. ఈ సీజన్ పూర్తి అవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ జోడీ మొదలైంది.. గతంలో వచ్చిన సీజన్ వన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ ఏడాది సీజన్ 2 ప్రారంభమైంది. బీబీ జోడీ సీజన్ 2లో ఈ జోడీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది స్టార్ మా. భారీ అంచనాలు, సోషల్ మీడియాలో హంగామా, అభిమానుల భారీ అంచనాలతో ఈ జోడీ హౌస్ లోకి అడుగుపెట్టారు.. మొదటి పర్ఫామెన్స్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇక తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకసారి ప్రోమో ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం పదండి..

‘బీబీ జోడీ సీజన్ 2’ ప్రోమో.. 

‘బీబీ జోడీ సీజన్–2’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ షో ప్రోమో వీడియో రిలీజ్ కాగా.. ముందుగా ప్రదీప్ అదిరిపోయే ఇంట్రడక్షన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత జడ్జిలు కూడా బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ ఎపిసోడ్లో ప్రాపర్టీ రౌండ్ గా ప్రకటిస్తారు. ఇక షోలోని జోడీలు తమ డాన్స్ కు తగ్గట్లుగా ప్రాపర్టీని వాడుతూ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఒక్కొక్కరు కూడా తమ డాన్స్ తో జనాలను బాగా ఆకట్టుకుంటారు.. అమర్దీప్ కామెడీ టైమింగ్ ప్రోమో కి హైలైట్ గా నిల్చింది. ఆ తర్వాత నయని పావని శ్రీనివాస్ చేసిన డాన్స్ కి జడ్జెస్ ఫిదా అయ్యారు.. చివరిగా పవన్ రీతు ఇద్దరు కలిసి తమ ప్రాపర్టీతో బ్యూటిఫుల్ పర్ఫామెన్స్ ఇస్తారు. జడ్జెస్ ని ఆ పర్ఫామెన్స్ బాగా ఇంప్రెస్ చేస్తుంది. కానీ మార్కుల విషయంలో పెద్ద గొడవ జరుగుతుంది.

Also Read :అనిల్ రావిపూడి సీనియర్ హీరోలతో సినిమాలు అందుకే చేస్తున్నాడా..?

షో నుంచి వెళ్ళిపోయిన రీతూ..

బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా పోటీ పడుతున్న ఈ షోలో రీసెంట్ గా వైల్డ్ కార్డు ద్వారా రీతూ చౌదరి, డీమాన్ పవన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. థీమ్‌లో భాగంగా వీరిద్దరూ మాప్ తో ఛత్రపతి లోని ఏ వచ్చి బీపై వాలే సాంగ్ తో డ్యాన్స్ చేస్తారు.. పర్ఫామెన్స్ అయిన తర్వాత మార్కుల దగ్గర శ్రీ సత్య రీతు ఇద్దరు కూడా పెద్ద గొడవ పడతారు. ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేది అక్కడక్కడ కోఆర్డినేషన్ మిస్ అయింది అంటారు. అందరూ మార్కులు తక్కువ ఇవ్వడంతో రీతూ మీరు కావాలనే మార్కులు తక్కువ ఇస్తున్నారు అర్థమవుతుంది అని అంటుంది.. ఆ తర్వాత సత్యా డోంట్ డోంట్ అంటూ రీతుపై అరుస్తుంది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ చేస్తాం అప్పుడు కూడా మీరు 1,2 మార్కులు ఇవ్వండి లేదా ఏదైన ఇవ్వండి అంటూ సీరియస్ అవుతూ రీతూ బయటకు వెళ్ళిపోతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రోమో మాత్రం అదిరిపోయింది మరి ఎపిసోడ్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×